MLC 2023: అమెరికాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న మేజర్ ప్రీమియర్ లీగ్(MLC)పై అందరి దృష్టి ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. ఇందులో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ స్మిత్ ఆడటానికి ముందుకు రావడం ఆసక్తి నెలకొంది. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత ఇతను వాషింగ్టన్ ఫ్రీడమ్ కోసం ఆడనున్నాడు. అంతేగాక, ఫ్రాంచైజీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి అతను ఒక ఒప్పందానికి అంగీకరించాడు.
గత నెలలో 34 ఏళ్లు పూర్తి చేసుకున్న స్టీవ్ స్మిత్ చాలా రోజులుగా వాషింగ్టన్ లోనే ఉంటున్నాడు. 2017లో అమెరికా పౌరసత్వం ఉన్న డానీకి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిలయ్యాడు. యుఎస్‌ఎలో తన కెరీర్‌ను ముగించాలనుకుంటున్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అనే పత్రికకు వెల్లడించాడు. ఎమ్మెల్సీలో తన ప్రయాణాన్ని పున: ప్రారంభించనున్నట్లు పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్ (NSW) రాష్ట్ర జట్టు వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో భాగస్వామి కలిగి ఉంది. స్మిత్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియా ఎమ్మెల్సీకి సంబంధించి వచ్చే ఏడాది ప్రారంభంలో ఎటువంటి మ్చాచ్ లు లేవు. జూన్‌లో కరీబియన్లతో, ఆగస్టు చివరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 ఆడవల్సి ఉన్నది. యునైటెడ్ స్టేట్స్‌లో T20 ప్రపంచ కప్ తర్వాత మొదటి షెడ్యూల్ వెలుడనుంది.
ఎమ్మెల్సీ ప్రారంభ మ్యాచ్ శుక్రవారం జరగనుంది. కాలమానం ప్రకారం రాత్రి డల్లాస్‌లో సీటెల్ ఓర్కాస్ జట్టుతో తలపడునున్నారు. 30 వరకు జరిగే మొదటి సీజన్ లో హెన్రిక్స్, బెన్ ద్వార్షుయిస్, జోష్ ఫిలిప్ మరియు తన్వీర్ సంఘా వంటి ఆటగాళ్లు ఆడుతున్నట్లు స్మిత్ ఈ సందర్భంగా తెలిపారు. వీరంతా NSWతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారేనని అన్నాడు. ఆడనున్న ఐదు గేమ్‌లలో గొప్ప ప్రదర్శన ఇవ్వడానికి, జట్టును మరింత ప్రోత్సహించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు.