Animal: యానిమల్ సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్, మనుసున్న మారాజుగా పేరు సంపాదించిన మహేష్ బాబు ఈ సినిమాను వదులుకున్నారు. గతంలో వేర్వేరు కారణాల వల్ల పుష్ఫ సినిమాను వదులుకున్న మహేష్ బాబు యానిమల్ సినిమాను సైతం వదులుకున్నారని తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Written By: Suresh, Updated On : November 24, 2023 3:46 pm

Animal

Follow us on

Animal: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా యానిమల్. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. దీంతో అంచనాలు మరింతగా పెరిగాయి. యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది సినిమా ట్రైలర్. యానిమల్ ట్రైలర్ హిందీ వెర్షన్ కు 48 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కానీ తెలుగు ట్రైలర్ కు మాత్రం కేవలం 6.8 మిలియన్ల వ్యూసే వచ్చాయి. అయితే ఈ సినిమా ఊహించని రేంజ్ లో హిట్ అవుతుందని ఇప్పటి నుంచే అంటున్నారు. మరి ఇలాంటి సినిమాను మిస్ చేసుకున్న మన టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్, మనుసున్న మారాజుగా పేరు సంపాదించిన మహేష్ బాబు ఈ సినిమాను వదులుకున్నారు. గతంలో వేర్వేరు కారణాల వల్ల పుష్ఫ సినిమాను వదులుకున్న మహేష్ బాబు యానిమల్ సినిమాను సైతం వదులుకున్నారని తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు నటించి ఉంటే.. సూపర్ గా ఉండేదని కొంతమంది అంటున్నారు. అయితే ఇంకొంత మంది మాత్రం ఇలాంటి సినిమాలకు మహేష్ అసలు సూట్ అవరని, ఫ్యామిలీ, క్లాసికల్ సినిమాలు మాత్రమే బాగుంటాయని కొందరు అంటున్నారు. అందుకే మహేష్ కూడా నో చెప్పి ఉంటారని టాక్.

మహేష్ బాబు తొందరలోనే రాజమౌళి సినిమాలో నటించబోతున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ రేంజ్ పెరుగుతుందని ఎప్పటి నుంచో టాక్ ఉంది. రాజమౌళి సినిమాలంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఫిక్స్ అయిపోతారు నెటిజన్లు. అందుకే ఈ సినిమాను వదులుకున్నా మా మహేష్ కు నష్టం లేదంటూ సపోర్ట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇక భవిష్యత్తులో మహేష్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో సినిమా వస్తే చూడాలని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వస్తుందో లేదో చూడాలి.