https://oktelugu.com/

Anchor Rashmi: యాంకర్ రష్మీ గౌతమ్ అసలు వయసు తెలుసా? అప్పట్లో స్టార్ తో రొమాన్స్ చేసిన భామ!

ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపి బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది. రష్మీ-సుధీర్ మధ్య కెమిస్ట్రీ వేరే లెవెల్ లో ఉండేది. అలాగే ఈ జంటకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Written By: , Updated On : March 12, 2024 / 12:46 PM IST
Anchor Rashmi Gautam age

Anchor Rashmi Gautam age

Follow us on

Anchor Rashmi: బుల్లితెర టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. కొన్నేళ్లుగా స్మాల్ స్క్రీన్ పై తన హవా సాగిస్తుంది. రష్మీ హీరోయిన్ కావాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే ఆమెకు సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి. ఆ తర్వాత రష్మీకి ఆఫర్స్ లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. గ్యాప్ ఇచ్చి జబర్దస్త్ యాంకర్ అవతారం ఎత్తింది. ఈ షో ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. జబర్దస్త్ షోతో రష్మీ ఫేట్ మారిపోయింది.

ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపి బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది. రష్మీ-సుధీర్ మధ్య కెమిస్ట్రీ వేరే లెవెల్ లో ఉండేది. అలాగే ఈ జంటకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుధీర్ -రష్మీ డాన్స్ వీడియోలు ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉంటాయి. కాగా .. రష్మీ గురించి ఏదొక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా రష్మీ గౌతమ్ ఏజ్ గురించి చర్చ మొదలైంది.

రష్మీ అసలు వయసు అంతా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. వికీపీడియా ప్రకారం రష్మీ ఏజ్ 41. కానీ రష్మీ మాత్రం 37 గా చెప్పుకుంటుంది. దీంతో ఆమె రియల్ ఏజ్ ఎంతనే సందేహం కొనసాగుతుంది. అయితే రష్మీ 2002 లో కెరీర్ స్టార్ట్ చేసింది. తన మొదటి సినిమా ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ. ఈ చిత్రంలో కమెడియన్ సునీల్ కి ప్రియురాలి గా నటించింది. ఆ తర్వాత కరెంట్, బిందాస్ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది.

అంటే 22 ఏళ్ల క్రితమే రష్మీ ఇండస్ట్రీ కి వచ్చింది. దీన్ని బట్టి ఆమె ఏజ్ 40 ప్లస్ అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు రష్మీ వయసు అంత ఉండదని టీనేజ్ లోనే కెరీర్ ప్రారంభించిందని అంటున్నారు. కానీ ఇంతవరకు రష్మీ పెళ్లి చేసుకోలేదు. మరో వైపు సుడిగాలి సుధీర్ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్ కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు.రష్మీ కూడా సింగిల్ గా ఉంటుంది. సడన్ గా బుల్లితెర స్టార్స్ తమ బంధాన్ని ప్రకటించే అవకాశం కలదంటున్నారు.