https://oktelugu.com/

Saudi Arabia And Pakistan: పాపం పాకిస్తాన్.. సౌదీ అరేబియా ముందు “జేబు” వంపులు

పాకిస్తాన్ ఇస్లాం దేశమైనప్పటికీ.. అరబ్ దేశాలతో దానికి పెద్దగా సాన్నిహిత్యం ఉండదు. అది ఉగ్రవాదానికి షెల్టర్ ఇస్తుందని భావించి చాలా వరకు దేశాలు దానిని దూరం పెట్టాయి. పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ చిల్లిగవ్వ కూడా ఇవ్వవు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 12, 2024 / 12:39 PM IST

    Saudi Arabia And Pakistan

    Follow us on

    Saudi Arabia And Pakistan: పాకిస్తాన్ సైతాన్ దేశం కాబట్టి ఇస్లాం నిబంధనలు పాటించదు. దానికి తెలిసిందల్లా ఉగ్రవాదం, బాంబులు వేయటం, ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వటం, అడ్డగోలుగా పనులు విధించి జనాలను వేధించడం.. కానీ అరబ్ దేశాలు అలా ఉండవు. కొన్ని విషయాలను పక్కన పెడితే.. ఇస్లాం నిబంధనలను అవి పకడ్బందీగా అమలుచేస్తాయి.. అందులో ఏమాత్రం తేడా వచ్చినా తేడాగానే ప్రవర్తిస్తాయి. గతంలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ. అక్కడ ఆడవాళ్ళపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాయి. మరణ దండన విధించేందుకు కూడా వెనుకాడవు. ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించవు. ఎందుకంటే అవి కూడా ఒకప్పుడు ఉగ్రవాద బాధిత దేశాలు కాబట్టి.

    పాకిస్తాన్ ఇస్లాం దేశమైనప్పటికీ.. అరబ్ దేశాలతో దానికి పెద్దగా సాన్నిహిత్యం ఉండదు. అది ఉగ్రవాదానికి షెల్టర్ ఇస్తుందని భావించి చాలా వరకు దేశాలు దానిని దూరం పెట్టాయి. పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ చిల్లిగవ్వ కూడా ఇవ్వవు. ఇవ్వలేవు. విదేశాంగ విధానం ప్రకారం ప్రతి దేశంలో ఒక రాయబారి ఉంటారు. అలా సౌదీ అరేబియా కు తన దేశానికి సంబంధించిన ఓ వ్యక్తిని రాయబారిగా పాకిస్తాన్ పంపింది.. ఓ కీలక విషయాన్ని విస్మరించింది. దీంతో సౌదీ అరేబియా పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. “బుర్ర ఉండే ఇలాంటి పనులు చేస్తున్నారా” అంటూ విమర్శించింది.

    అరబ్ భాష, నిబంధనల ప్రకారం అక్కడ జేబు అనే పదం నిషిద్ధం. ఎందుకంటే జేబు అంటే అతి పెద్ద పురుషాంగం అని అర్థం. అందుకే ఆ పదాన్ని అక్కడ వాడరు. కానీ పాకిస్తాన్ సౌదీ అరేబియాకు అక్బర్ జేబ్ అనే వ్యక్తిని రాయబారిగా పంపింది. అది సౌదీ అరేబియాకు కోపం తెప్పించింది. అక్బర్ అనే పేరు వరకైతే ఓకే కానీ.. జేబు అనే పదాన్ని ఎలా పలకాలి అని సౌదీ ప్రశ్నించింది. కేవలం సౌదీ మాత్రమే కాదు బహ్రేయిన్, ఖతార్ లాంటి దేశాల్లోనూ ఇలాంటి నిబంధనే ఉంటుంది. అక్బర్ జేబును ఆ ప్రాంతాలకు కూడా పాకిస్తాన్ రాయబారిగా పంపితే.. ఆ దేశాలు తిట్టి మరి వెనక్కి పంపించాయి. అయినప్పటికీ పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోలేదు. ఆ వ్యక్తినే మళ్లీ సౌదీ అరేబియా పంపింది. దీంతో సౌదీ అరేబియా పాకిస్తాన్ కు చివాట్లు పెట్టింది. ఫలితంగా పాక్ తల వంచుకోవాల్సి వచ్చింది.

    వాస్తవానికి పాకిస్తాన్ తనను తాను అరబ్ దేశంగా చెప్పుకుంటుంది. అక్కడి పాఠ్యపుస్తకాల్లో భారత్ పై జరిగిన యుద్ధాల్లో గెలిచినట్టు ప్రచురించింది. కాశ్మీర్ ను హిందువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పుకుంది. పాకిస్తాన్ అరేబియా సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ప్రచారం చేసుకుంది. మరి అంతటి అరేబియా సంస్కృతి తెలిసిన పాకిస్థాన్ కు జేబు అనే పేరు ఉన్న వ్యక్తిని సౌదీ అరేబియాకు పంపకూడదని తెలియదా? ఆ పదం లో ఎంత బూతు దాగి ఉందో పాకిస్తాన్ కు అర్థం కాదా? అరబ్ దేశమైతే అలాంటి పేరు ఉన్న వ్యక్తిని మరో అరబ్ దేశానికి పంపిస్తుందా? పులిని చూసి వాతలు పెట్టుకుంటే నక్క పరిస్థితి ఎలా ఉంటుంది?! అచ్చం పాకిస్తాన్ లా ఉంటుంది.