MWC 2024: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. సమస్తం మన వెంటేనని.. అనుకుంటున్న రోజులివి. ఫోన్ పే నుంచి సినిమా టికెట్ బుకింగ్ దాకా.. ప్రతీది ఫోన్ ఆధారంగానే జరుగుతున్నాయి. అందుకే స్మార్ట్ ఫోన్ అనేది మన శరీరంలో ఒక భాగం అయిపోయింది. వాడకం పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. అలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఫోన్లను వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ (World Mobile Congress)
లో ప్రదర్శిస్తారు. అందులో Xiaomi అనే సంస్థ 14 Ultra మోడల్ ను మార్కెట్లో త్వరలో ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ ను World Mobile Congress లో వెల్లడించింది.
Xiaomi రూపొందించిన 14 Ultra మోడల్ లో కెమెరా ఆప్ గ్రేడ్ ఉంది. ప్రత్యేకమైన ఒక అంగుళం Sony LYT-900 సెన్సార్ ను ఈ ఫోన్లో చేర్చారు. ఈ కొత్త సెన్సార్ మెరుగైన కాంతిని ప్రదర్శిస్తుంది. దీనివల్ల high resolution నాణ్యత ఫోటోలు తీయవచ్చు. అనుకున్నట్టుగా పోర్ట్రైట్ గా మార్చవచ్చు. బ్యాక్ గ్రౌండ్ ను బ్లర్ చేయవచ్చు.. ఈ మోడల్ లో స్టాండర్డ్ వెర్షన్ ను మాత్రమే భారత మార్కెట్లోకి ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని Xiaomi భావిస్తోంది. Xiaomi 14 Ultra లో మూడు మోడల్స్ రూపొందించింది. అయితే ఇందులో స్టాండర్డ్ వెర్షన్ మాత్రమే ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆల్ట్రా, ప్రో వేరియంట్ మాత్రం భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది. అయితే దీనికి గల కారణాలను Xiaomi చెప్పడం లేదు.
Xiaomi 2022లో జర్మన్ ఆప్టిక్స్ భాగంలో పెద్ద సంస్థ అయిన లైకా తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. అప్పటినుంచి తన ఫోన్లలో లైకా అందించిన అల్ట్రా పరికరాలను అమర్చుతోంది. ఇవి సెన్సార్ లాగా పని చేస్తుంటాయి. ఇక Xiaomi 14 ultra model లో శక్తివంతమైన కెమెరా ఏర్పాటు చేసింది. ఇది చూడడానికి స్పెక్స్ – హెవీ ఫోన్ లాగా ఉంది.. గతంలో ఉన్న మోడల్ తో పరిశీలిస్తే ఇందులో Snapdragon 8 Gen 3 చిప్ సెట్ ను అమర్చారు. ప్రైమరీ రియర్ కెమెరా ను అప్ గ్రేడ్ చేశారు. దీని డిజైన్లో కూడా కొన్ని కొన్ని మార్పులు చేశారు. Oneplus ఫోన్ మాదిరే దీని వెనక లెదర్ ఫినిషింగ్ మెటీరియల్ ఇచ్చారు. దానివల్ల ఫోన్ చేతిలో నుంచి జారిపోకుండా ఉంటుంది. స్క్రీన్ 1Hz నుంచి 120 Hz వరకు ఉంది. 6.73 అంగుళాల LTPO స్క్రీన్ ప్రకాశవంతమైన డిస్ ప్లే అందిస్తుంది..అంతకు ముందు ఉన్న మోడల్ తో పోలిస్తే 14 ultra అనుభూతి ఇస్తుందని Xiaomi చెబుతోంది. మన దేశ మార్కెట్లోకి స్టాండర్డ్ వెర్షన్ మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ధర ఎంత ఉంటుందనేది Xiaomi బయటికి వెల్లడించడం లేదు.