Sakshi Tanwar: సాక్షి తన్వర్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈమె బాలీవుడ్ సీరియల్ యాక్ట్రెస్. అయితే ఆమె నటించిన పలు సీరియల్స్ తెలుగులో కూడా డబ్ అయ్యాయి. బుల్లితెర మీద ఆమెకు తిరుగులేని ఇమేజ్ ఉంది. 1973లో రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ లో ఆమె జన్మించారు. రాజ్ పుత్ ఫ్యామిలీకి చెందిన సాక్షి తన్వర్ తండ్రి రిటైర్డ్ సీబీఐ ఆఫీసర్. 1999లో ఆమె నట ప్రస్థానం మొదలైంది. లైల ఆమె నటించిన మొదటి సీరియల్.
అనంతరం ఓ షోకి యాంకర్ గా చేశారు. కాగా కహాని ఘర్ ఘర్ కి సీరియల్ తో సాక్షి తన్వర్ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. 2000లో ప్రసారమైన కహానీ ఘర్ ఘర్ కి సాక్షి తన్వర్ ఇండియా వైడ్ పాప్యులర్ చేసింది. ఈ సీరియల్ పలు భాషల్లో డబ్ అయ్యింది. ఇరవైకి సీరియల్స్ లో సాక్షి తన్వర్ నటించింది.
సాక్షి తన్వర్ లోని సహజ నటనకు మెచ్చి దంగల్ డైరెక్టర్ నితీష్ తివారి అమర్ ఖాన్ కి జంటగా ఛాన్స్ ఇచ్చాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో సాక్షి అమిర్ ఖాన్ వైఫ్ రోల్ చేశారు. స్పోర్ట్స్ డ్రామా దంగల వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సాక్షి తన్వర్ పాత్ర మెప్పించింది. కాగా సాక్షి ప్రస్తుత వయసు 50 ఏళ్ళు.
సాక్షి తన్వర్ పెళ్లి చేసుకోలేదు. అందుకు కారణం ఏమిటో తెలియదు. అయితే ఓ ఐదేళ్ల క్రితం పాపను దత్తత తీసుకుంది. అలా పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది. మొహల్లా అస్సి, డైల్ 100, సామ్రాట్ పృథ్విరాజ్ చిత్రాల్లో ఆమె నటించారు . సామ్రాట్ పృథ్విరాజ్ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు. సీరియల్స్ తో పాటు వెబ్ సిరీస్లలో ఆమె నటిస్తున్నారు. ఇక ఈమె ఒక సీరియల్ ఎపిసోడ్ కి రూ. 1.5 లక్షలు తీసుకుంటారట.