Rajamouli Future Movie Expenses: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో తన స్టామినా ఏంటో చూపించాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఈ సినిమాతో హాలీవుడ్ డైరెక్టర్లను సైతం తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజా దర్శకుడి పక్కన తన పేరు నిలుపుకోవడమే తన డ్రీమ్ అని రాజమౌళి చాలా సందర్భాల్లో తెలియజేశాడు.
మరి ఇలాంటి రాజమౌళి సినిమా సినిమాకి బడ్జెట్ ని భారీగా పెంచేస్తున్నాడు. ఇక మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం దాదాపు 1200 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నారంటే ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇలాంటి సందర్భంలోనే సినిమా సినిమాకు బడ్జెట్ ను పెంచుతున్నాడు. దాని వల్ల ఇక ఫ్యూచర్లో రాజమౌళి తో సినిమా చేసే ప్రొడ్యూసర్లు వాళ్ల ఆస్తులను సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడనుందంటూ సినిమా ఇండస్ట్రీలో కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.
Also Read: నా రాజాని వదిలి ఉండలేకనే ‘బిగ్ బాస్ 9’ ఆఫర్ ని రిజెక్ట్ చేసాను – దివ్వెల మాధురి
మరి రాజమౌళి సినిమా స్థాయిని పెంచుతుండటం మంచిదే, అయినప్పటికి రాజమౌళి సినిమాలను చూసిన ప్రేక్షకులు ఇక మీదట ప్రతి దర్శకుడు చేసే సినిమా అలానే ఉండాలి అని అనుకుంటారు. దాని వల్ల చిన్న సినిమాలకు భారీగా నష్టం వాటిల్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇక చిన్న సినిమా వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి చాలా లో విజువల్స్ తో సినిమాని చేసి ప్రేక్షకుడిని మెప్పించాలనే ప్రయత్నంలో ఉంటారు…
ఇక రాజమౌళి సినిమాలను చూసిన ప్రేక్షకులకు ఇలాంటి చిన్న సినిమాలు పెద్దగా నచ్చకపోవచ్చు. దానివల్ల చిన్న సినిమాల మీద భారీ ఎఫెక్ట్ అయితే పడే అవకాశాలైతే ఉన్నాయి…ఇక ఇదిలా ఉంటే రాజమౌళి అభిమానులు మాత్రం ఆయన సినిమా కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు… చూడాలి మరి రాజమౌళి తన తదుపరి సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడు అనేది….