Divvala Madhuri about Bigg Boss 9: భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) మొదలైంది. మొదటి రోజు నుండే హౌస్ లో గొడవలు అయ్యాయి, సెలబ్రిటీలు మంచిగానే ఉన్నారు కానీ, అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి వచ్చిన సామాన్యులు అతిగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరీష్ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. జియో హాట్ స్టార్ లైవ్ లో ఇతన్ని చూసే వాళ్లకు మెంటలెక్కిపొతుంది. పూటకు ఒక షేడ్ చూపిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ మొదలు అవ్వకముందే హౌస్ లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారు అనేది సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. వారిలో దివ్వెల మాధురి పేరు కూడా ఉంది. ఈమె పేరు తెలియని వాళ్లంటూ ఎవ్వరూ లేరు. మాజీ వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి ఈమె. లోకం ఏమి అనుకున్నా పర్వాలేదు, మా జీవితం మేము సంతోషంగా బ్రతుకుతాము అనే సిద్ధాంతం తో ముందుకు వెళ్తున్నారు ఈ జంట.
వీళ్ళను తీవ్రంగా విమర్శించే వాళ్ళు ఉన్నారు, అదే విధంగా వీళ్లకు సపోర్టు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే మామూలు రేంజ్ లో ఉండదు, మంచి ఫైర్ మీద ఉంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈమె రాక కోసం చాలా ఎదురు చూశారు. కానీ ఈమె గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో కనిపించకపోవడం తో కాస్త నిరాశకు గురయ్యారు. సరే ఇప్పుడు కాకపోయినా, కనీసం వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అయినా ఈమె వస్తుందని అనుకున్నారు. కానీ అది కూడా సాధ్యం కాదని రీసెంట్ గానే తెలిసిందే. ఇటీవలే తన దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఈమె ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళింది. అక్కడ మీడియా తో మాట్లాడుతున్నప్పుడు బిగ్ బాస్ 9 ప్రస్తావన వచ్చింది.
మీకు బిగ్ బాస్ 9 ఆఫర్ వచ్చింది అంట కదా, మరీ వెళ్తున్నారా అని అడగ్గా, దానికి మాధురి సమాధానం చెప్తూ ‘నాకు ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే. కానీ అన్ని రోజులు నా రాజా కి దూరం గా ఉండడం ఊహిస్తేనే చాలా కష్టం గా అనిపించింది. నేను ఆయన్ని వదిలి అన్ని రోజులు ఉండలేను, ఆయన కూడా ఉండలేడు. అందుకే నేను బిగ్ బాస్ 9 ఆఫర్ ని రిజెక్ట్ చేశాను’ అని చెప్పుకొచ్చింది మాధురి. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి.