Actors Dubbing Remuneration: హీరోలకి వాళ్ల సినిమాలో డబ్బింగ్ చెప్పినందుకు కూడా డబ్బులు ఇస్తారా..?

కొంతమంది ప్రొడ్యూసర్లు డబ్బింగ్ ఆర్టిస్టుల చేత హీరోలకి డబ్బింగ్ చెప్పించొచ్చు కానీ అలా చెప్పడం వల్ల ఆ వాయిస్ లో క్లారిటీ పర్ఫెక్ట్ గా రాదనే ఉద్దేశ్యంతో హీరోలు దానిని అవైడ్ చేస్తూ ఉంటారు.

Written By: Gopi, Updated On : February 29, 2024 3:29 pm
Follow us on

Actors Dubbing Remuneration: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతూ ఉంటారు.ఇక ఆర్టిస్టు లు ఒక సినిమా అయిపోయిన వెంటనే మరొక సినిమా షూటింగ్ పనుల్లో లీనమైపోతారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్లు ఇంతకుముందు చేసిన సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఆ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇక ఇది ఇలా ఉంటే ఆర్టిస్ట్ లు డబ్బింగ్ కి కూడా డబ్బులు తీసుకుంటారనే విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతం ఉన్న హీరోలందరికీ రెమ్యునరేషన్ కాకుండా డబ్బింగ్ కి వేరే సపరేట్ గా డబ్బులు ఇస్తారు. అయితే దీనివల్ల కొంతమంది ప్రొడ్యూసర్లు డబ్బింగ్ ఆర్టిస్టుల చేత హీరోలకి డబ్బింగ్ చెప్పించొచ్చు కానీ అలా చెప్పడం వల్ల ఆ వాయిస్ లో క్లారిటీ పర్ఫెక్ట్ గా రాదనే ఉద్దేశ్యంతో హీరోలు దానిని అవైడ్ చేస్తూ ఉంటారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ల క్యారెక్టర్ కి వాళ్లే డబ్బింగ్ చెప్పుకోవడానికి ముందుకు వస్తు ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే ఒక సినిమా డబ్బింగ్ కి ప్రకాష్ రాజ్ అందుబాటులో లేకపోతే, ఆయన వాయిస్ ని మిమిక్రీ ఆర్టిస్ట్ చేత డబ్బింగ్ చెప్పించడంతో ఆయన తీవ్రమైన కోపానికి గురై, ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ ని తిట్టాడట.

ఇక అప్పటినుంచి ఆర్టిస్టులు స్వయంగా మిమిక్రీ ఆర్టిస్టులకి చెబితేనే వాళ్ళు డబ్బింగ్ చెప్పడానికి ముందుకు వస్తున్నారు. లేకపోతే మాత్రం ఎవరు డబ్బింగ్ చెప్పడానికి సిద్ధం అవ్వట్లేదు. ఒక క్యారెక్టర్ వాయిస్ అనేది ఆ సినిమా విజయం లో చాలా పాత్రను పోషిస్తుంది.అందుకే ఒక సినిమా విషయంలో దర్శకుడు మొదటినుంచి చివరి వరకు అన్ని విషయాల్లో చాలా క్లారిటీగా చూసుకుంటూ ఉంటాడు. ఒకవేళ హిందీ ఆర్టిస్టులు ఉంటే వాళ్లకి ఎవరి చేత డబ్బింగ్ చెప్పించాలనేది కూడా డైరెక్టర్ చాలా కేర్ ఫుల్ గా చూసుకున్న తర్వాతే ఆ పాత్ర కి డబ్బింగ్ చెప్పిస్తాడు…అయితే హీరో క్యారెక్టర్ కి డబ్బింగ్ సరిగ్గా సెట్ అవ్వక ప్లాప్ అయినా సినిమాలు కూడా ఉన్నాయి…