https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ షోకి ఆ సెలబ్రిటీ వద్దంటే వద్దు… పబ్లిక్ డిమాండ్, మేకర్స్ ప్లాన్ ఏంటీ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయ్యిందని సమాచారం. షో ప్రారంభానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో దాదాపు కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు. కాగా బిగ్ బాస్ హౌస్లోకి ఓ సెలబ్రిటీ అడుగుపెడతాడని వార్తలు వస్తుండగా, తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : August 18, 2024 / 10:22 AM IST

    venu Swamy

    Follow us on

    Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ సీజన్ కంటెస్టెంట్స్ వీరే అంటూ కొందరు సెలబ్రిటీల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు కూడా లిస్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వేణు స్వామి ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావద్దని పబ్లిక్ డిమాండ్ చేస్తుంది. అతడు షోలో కంటెస్ట్ చేయడానికి వీల్లేదని అంటున్నారు.

    జాతకాల పేరుతో వేణు స్వామి సెలెబ్రెటీల పర్సనల్ లైఫ్ గురించి ఇష్టమొచ్చిన విధంగా కామెంట్లు చేస్తుంటాడు. వారి వైవాహిక జీవితం, కెరీర్ వంటి విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతుంటాడు. నెటిజన్లు వేణు స్వామిని ఎంతగా ట్రోల్ చేసినా కూడా పద్ధతి మార్చుకోవడం లేదు. ఇటీవల నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. వారి నిశ్చితార్థం జరిగిన వెంటనే… నాగ చైతన్య – శోభిత జాతకం చెప్తాను అంటూ వేణు స్వామి దిగిపోయాడు.

    శుభమా అని వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటే జాతకం బాగాలేదు. ముహూర్తం మంచిది కాదు. నాగ చైతన్య – శోభిత కలిసుండే అవకాశం లేదు అని వేణు స్వామి నెగిటివ్ కామెంట్స్ చేశాడు. దీంతో కొందరు డిజిటల్ మీడియా యూనియన్లు వేణు స్వామి పై హైదరాబాద్ మహిళా కమిషన్ కు కంప్లైంట్ చేశారు. దీంతో కమిషన్ ఆయనకు నోటీసులు పంపింది. ఈ నెల 22వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది.

    వేణు స్వామి బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన నేపథ్యంలో ఓ నెల క్రితం కొందరు యూట్యూబర్స్ ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కి లావిష్ పార్టీ ఇచ్చాడట. కొంత డబ్బు కూడా ముట్టజెప్పాడట. తనకు సపోర్ట్ చేయాలని బిగ్ బాస్ ప్రేక్షకుల ఓట్లు తనకు పడేలా చూడాలని కోరాడట. అయితే వేణు స్వామి నాగార్జున కొడుకు మీద జాతకం అంటూ ఇటివంటి కామెంట్స్ చేయడం దుమారం రేపింది. దీంతో బిగ్ బాస్ హౌస్ లోకి వేణు స్వామికి ఎంట్రీ ఉండదు అని వార్తలు వైరల్ అయ్యాయి.

    తాజాగా ఓ మీడియా ఛానల్ బిగ్ బాస్ 8 గురించి పబ్లిక్ అభిప్రాయం తెలుసుకుంది. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ గా ఎవరు వెళితే బాగుంటుంది అని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మాట్లాడుతూ .. వేణు స్వామిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకు రావద్దు. ఆయన వల్ల ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు. అక్కడ గేమ్స్, స్కిట్స్ చేయమంటే ఆయన జాతకాలు చెప్పుకుంటూ కూర్చుంటాడు. బిగ్ బాస్ ఎవరు గెలుస్తారు అని ముందే చెప్తాను అంటాడు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏమి జరగడం లేదు అని వ్యాఖ్యలు చేశాడు.

    కాబట్టి బిగ్ బాస్ షోకి వేణు స్వామి అనవసరం. అతడి వలన వివాదాలు తప్పితే వినోదం ఉండదని బిగ్ బాస్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. మరి పబ్లిక్ డిమాండ్ ని మేకర్స్ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సెప్టెంబర్ 8న ప్రారంభం అవుతుందనే వాదన ఉంది.