Suma And Dixit Shetty: ఇండస్ట్రీ కి సంబంధించిన ఒక ఈవెంట్ ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించడంలో యాంకర్స్ కీలక పాత్ర వహిస్తుంటారు… అందరిని బాగా రిసీవ్ చేసుకొని ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా బాగా మాట్లాడాలి. ఈ మాత్రం తేడా జరిగిన పెను ప్రమాదాలు జరిగే అవకాశమైతే ఉంది. ఇక ఇలాంటి విషయాల్లో ఆరితేరిన సుమ ఇప్పటి వరకు ఎన్నో షోలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. అందుకే గత కొద్ది సంవత్సరాల నుంచి సుమ పోటీ లేకుండా ఒక్కరే చాలా ఈవెంట్స్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ తనను తాను టాప్ యాంకర్ గా ఎలివేట్ చేసుకుంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఏ ఈవెంట్ జరిగినా కూడా ఆ షో కి సుమ హోస్ట్ గా వ్యవహరించాల్సిందే. ఆమె చేస్తేనే ఆ షో కి అందం వస్తోందనేంతలా గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆమె హోస్ట్ గా చేసే ప్రతి ఈవెంట్లో తన స్వతహాగా కొన్ని పంచులను వేస్తూ జనాన్ని ఎంటర్టైన్ చేస్తుంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందాన లీడ్ రోల్ లో వచ్చిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ ని కండక్ట్ చేశారు.
అందులో హీరోగా నటించిన దీక్షిత్ శెట్టి స్టేజ్ మీదకి వచ్చి సుమా గారికి థాంక్స్ చెప్పాడు… ఆయన థాంక్స్ చెప్పడానికి గల కారణాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు. ఏంటి అంటే సుమ గారు మీరు నన్ను ఇంటర్వ్యూ చేసిన ఒక వీడియోను రాహుల్ రవీంద్రన్ గారు చూశారట. అది చూశాక ఈ సినిమాలో విక్రమ్ క్యారెక్టర్ కి నేను బాగుంటానని తను ఫిక్స్ అయి నన్ను సెలెక్ట్ చేసుకున్నారట.
అందుకే మీకు థాంక్స్ చెబుతున్నాను అన్నాడు. దాంతో సుమ దీక్షిత్ శెట్టికి కౌంటర్ ఇస మీ రెమ్యునరేషన్ లో కొంత పర్సంటేజ్ నాకు ఇస్తే బాగుంటుందని అడిగింది… దాంతో దీక్షిత్ శెట్టి మైక్ తీసుకొని ఇంతకుముందు నేను వచ్చినప్పుడు నా పక్కన ఒక పెద్ద కార్ వచ్చి ఆగింది. ఆ కారును చూసి అల్లు అరవింద్ గారు వచ్చారా అని అడిగాను. కానీ ఆ పక్కన ఉన్న వ్యక్తి కాదు సుమ గారు వచ్చారు అని చెప్పాడు అనగానే ఒక్కసారిగా సుమ షాక్ అయింది.
ఇక అప్పుడు దీక్షిత్ సైతం సుమ తో మీకు వచ్చే రెమ్యునరేషన్ లో మాకు కొంచెం వాటా ఇస్తే బాగుంటుంది అని కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన జనాలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు అందరికి కౌంటర్లు ఇచ్చే సుమా నీ తన పంచ్ తో ఎన్ కౌంటర్ చేసేశాడు అంటూ కామెంట్స్ చేస్తుండడం విశేషం…