Rajamouli: ఒకప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… ఆయన చేసిన సినిమాలన్ని పేక్షకులకు విపరీతంగా నచ్చేవి… కమర్షియల్ సినిమాలను చేయడంలో ఆయనను మించిన వారు మరెవరు లేరు. పోకిరి సినిమాతో మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందించిన ఆయన ఆ సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును సెట్ చేశాడు. ఇక ఈ సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అలాంటి ఫార్మాట్లోనే సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించారు… ఇక అప్పటివరకు రాజమౌళి సైతం వరుస సక్సెస్ లను సాధిస్తూ వచ్చినప్పటికి అతనికి ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా దక్కలేదు. దాంతో పూరి జగన్నాథ్ మీద కోపంతో ఒక భారీ సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి రామ్ చరణ్ ను పెట్టి మగధీర సినిమా చేసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను సాధించాడు. మొత్తానికైతే వీళ్ళిద్దరికీ అప్పట్లో పోటీ అయితే ఉండేది…
రాజమౌళి ఎక్కువ రోజులు సినిమా మీద సమయాన్ని కేటాయిస్తే పూరి జగన్నాథ్ మాత్రం మూడు నెలల్లో సినిమాను చేసి ఇండస్ట్రీ హిట్టుగా మలిచేవాడు…ఇక అదెలా సాధ్యమవుతుంది అంటూ రాజమౌళి సైతం పలు సందర్భాల్లో పూరి జగన్నాథ్ ను అడగడం అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది.
ఏది ఏమైనా కూడా పూరి జగన్నాథ్ సినిమాలను స్పీడ్ గా చేస్తాడనే ఒక పేరైతే ఉంది. ఇక ఇప్పుడు సైతం ఆయన హీరోగా ఒక సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని సాధించి ఇంతకుముందు తను ఎలాగైతే ఒక టాప్ డైరెక్టర్ గా వెలుగొందాడో ఇప్పుడు కూడా అలానే గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రస్తుతం రాజమౌళి మాత్రం పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు. మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు…