https://oktelugu.com/

Revanth Reddy : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముందు రేవంత్ మెలిక.. మోడీని భలే ఇరకాటం లో పెట్టాడే..

దీంతో మోడీని రేవంత్ ఇరకాటంలో పడేసే స్కెచ్ పకడ్బందీగా రూపొందించారనే ప్రచారం జరుగుతోంది. మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ స్థాయిలో నిధులు విడుదల చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2024 10:31 pm
    Follow us on

    Revanth Reddy : విస్తారంగా కురుస్తున్న వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం.. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడుతున్న నేపథ్యంలో రికార్డులు బద్దలయ్యేలాగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం జిల్లాలో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో నష్టం అపారంగా చోటుచేసుకుంది.

    వరదల వల్ల ఖమ్మం, వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం హెలికాప్టర్ లో ఖమ్మం, వరంగల్ లో పర్యటించారు. ఏరియల్ సర్వే నిర్వహించారు.. ఖమ్మం జిల్లాలోని పాలేరు, మధిర నియోజకవర్గం కేంద్రమంత్రి పర్యటించారు. కేంద్రమంత్రి వెంట మరో కేంద్రమంత్రి బండి సంజయ్ ఉన్నారు. వీరిద్దరూ ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలను పరిశీలించారు. జరిగిన నష్టాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇతోధికంగా ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో పర్యటన పూర్తయిన తర్వాత కేంద్ర మంత్రులు వరద నష్టం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించేందుకు హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాదులో సెక్రటేరియట్ లో అధికారులతో కలిసి వరద నష్టం పై సమీక్షించారు. సెక్రటేరియట్ కు వచ్చిన బండి సంజయ్, శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా నమోదు చేసుకున్నారు.. తక్షణ సహాయంతో పాటు శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ మంత్రులను కోరారు. వర్షం వల్ల 5,438 కోట్ల నష్టం వాటిల్లిందని, పాము ప్రాథమికంగా అంచనా వేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ కేంద్ర మంత్రుల వద్ద వెల్లడించారు.

    నిబంధనలు సడలించాలి

    వరదల వల్ల తమ తీవ్రంగా నష్టపోయామని.. ఈ క్రమంలో ఎన్డిఆర్ఎఫ్ నిధుల విడుదల విషయంలో అనుసరించే మార్గదర్శకాలను సడలించాలని రేవంత్ కేంద్ర మంత్రులను కోరారు..” ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సహాయం చేస్తారో తెలంగాణ రాష్ట్రానికి కూడా అదే విధంగా సహకరించాలి. రెండు రాష్ట్రాలను ఒకే మాదిరిగా చూడాలని” రేవంత్ రెడ్డి కోరారు. ఇదే క్రమంలో వరద ప్రభావం వల్ల జరిగిన నష్టాన్ని.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్   తో కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి వివరించారు.. వరదల వల్ల అన్ని జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉందని, రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు. వాటికి మరమ్మతులు చేయాలని.. కొన్నింటిని శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలని.. ఇందుకోసం కేంద్రం నుంచి భారీగా నిధులు ఇవ్వాలని ఆయన కోరారు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తక్షణ సహాయంగా బాధిత కుటుంబాలకు పదివేల రూపాయలు పంపిణీ చేస్తున్నట్టు కేంద్రమంత్రికి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.. అయితే కేంద్ర మంత్రి ఎదుట నిబంధనలను సడలించాలని ముఖ్యమంత్రి కోరడంతో.. రాజకీయంగా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తెలంగాణ నుంచి ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి ఇక్కడి ప్రజలు 8 సీట్లల్లో గెలిపించారు. ఈ క్రమంలో ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని.. తెలంగాణ రాష్ట్రానికి సహాయం చేయాలని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని అంతర్గతంగా కోరినట్లు తెలుస్తోంది. దీంతో మోడీని రేవంత్ ఇరకాటంలో పడేసే స్కెచ్ పకడ్బందీగా రూపొందించారనే ప్రచారం జరుగుతోంది. మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ స్థాయిలో నిధులు విడుదల చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.