Bigg Boss 9 Telugu Divvel Madhuri: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఎవ్వరూ ఊహించనివి జరుగుతున్నాయి. రీ ఎంట్రీల పర్వం ఒకపక్క కొనసాగుతుంటే, మరోపక్క ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. ఈ సీజన్ లోకి నిజమైన ఫైర్ స్ట్రోమ్ లాగా హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది దివ్వెల మాధురి మాత్రమే. వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు ఆమె అందరి కంటెస్టెంట్స్ తో గొడవలు పెట్టుకుంది. నోరు పారేసుకుంది. ఇష్టమొచ్చినట్టు వ్యవహరించింది. కానీ అవన్నీ మర్చిపోయి అందరితో స్నేహంగా ఉండేది. చాలా డిఫరెంట్ క్యారక్టర్ ఈమెది అని అనిపించుకుంది. కానీ అందరితో చాలా కటువుగా ఉండేందుకు ప్రయత్నం చేసిన మాధురి, హౌస్ లోకి తానూ వచ్చింది గేమ్ ఆడదానికే, బాండింగ్స్ పెట్టుకోవడానికి కాదు అని చెప్పుకొచ్చిన మాధురి, తనూజ ని తన సొంత కూతురు లాగా దగ్గరకు తీసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
తనూజ ఎన్నోసార్లు నాతో బాండింగ్ వద్దు, నన్ను వదిలేయండి బాబోయ్ అంటూ ఈమె ముఖం మీద చెప్పినా కూడా వదిలేది కాదు. తనూజ ఎక్కడుంటే, మాధురి అక్కడ ఉండేది. చివరికి ఆమెకు బాధ వచ్చి కాసేపు ఒంటరిగా ఉండాలని అనుకున్నా కూడా ఒంటరిగా వదిలేది కాదు. అంతలా బాండింగ్ ఆమెతో ఎందుకు ఏర్పాటు చేసుకుంది అని చాలా మందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఆమెతో బంధం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం, తనూజ అందరికంటే టాప్ స్థానం లో ఉంది కాబట్టే. ఆమెకు సపోర్టుగా ప్రయాణం సాగిస్తే, తనూజ నామినేషన్స్ లో లేని రోజు మాధురి నామినేషన్స్ లోకి వస్తే సేవ్ అవ్వొచ్చు అనే ప్లాన్ తో తనూజ తో బాండింగ్ పెట్టుకుంది. ఇక ఎప్పుడైతే తనూజ చేతుల్లోకి సేవింగ్ పవర్ వచ్చిందో, ఇక ఆమెని అయస్కాంతం లాగా కర్చుకుంది. ఈ వారంలో తనూజ తో గొడవ జరిగింది,కానీ గొడవ జరిగిన రోజే తనూజ కు జడలు వేస్తూ కనిపించింది.
హౌస్ లో అందరూ ఇది చూసి షాక్ కి గురయ్యారు. అంత యాటిట్యూడ్ ఉన్న మాధురి, తనూజ వద్ద ఇలా తగ్గి ఉండడానికి కారణం, తనని ఎలిమినేషన్ నుండి తెప్పిస్తుంది అనే ఆశతోనే. అయితే నేడు ఎలిమినేషన్ రౌండ్ లోకి గౌరవ్, దివ్వెల మాధురి వచ్చారు. వీళ్లిద్దరు ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నప్పుడు నాగార్జున తనూజ ని సేవింగ్ పవర్ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు తనూజ ‘లేదు సార్’ అని సమాధానం చెప్పింది అట. దీంతో తక్కువ ఓటింగ్ వచ్చిన మాధురి ఎలిమినేట్ అయ్యింది, గౌరవ్ సేవ్ అయ్యాడు. ఈ ఎపిసోడ్ రేపు టెలికాస్ట్ కానుంది. ఒక ప్రణాళిక బద్దంగా తనూజ మాధురి ని డైరెక్ట్ నామినేట్ చేయడం, మాధురి కోసం సేవింగ్ పవర్ ని ఉపయోగించకపోవడం వంటివి చూస్తుంటే తనూజ మాస్టర్ మైండ్ గేమ్ ని నోరెళ్లబెట్టే పరిస్థితి లోపల ఉన్న హౌస్ మేట్స్ కి చూసే ఆడియన్స్ కి కలిగింది.