Renu Desai: కలిసి బ్రతకలేం అనుకున్నప్పుడు విడాకులు తీసుకోవడం నేరమే కాదు : రేణుదేశాయ్

ఇద్దరి మనస్తత్వాలు ఒకటిగా కలవనప్పుడు విడిపోయి బతకడం మంచిది అని మేము అనుకుంటాం మా మీద ఇష్టం వచ్చినట్టుగా రాయడం అనేది కరెక్ట్ కాదు. అంటూ ఆమె కొంచెం ఘాటుగానే స్పందించింది.

Written By: Gopi, Updated On : December 10, 2023 9:01 am

Renu Desai

Follow us on

Renu Desai: సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు మంచి సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక అందులో భాగంగానే మంచి స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ దానికి తగ్గట్టు గా మంచి నటనని కనబరుస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొన్నిసార్లు కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలిపోతారు, మరి కొంతమంది మాత్రం సక్సెస్ ఫుల్ హీరోలుగా, హీరోయిన్లుగా వెలుగొందుతూ ఉంటారు.

వాళ్ల టాలెంట్ ని బట్టి సక్సెస్ అనేది వాళ్లకి వచ్చే గిఫ్ట్ లాంటివి. ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయి నెట్లో ఒక పోస్ట్ ని పెట్టింది. అది ఏంటి అంటే నటీనటులు అంటే వాళ్లు కూడా మనుషులే వాళ్లకు కూడా వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. నటన అనేది సినిమా వరకే చూసుకుంటే బావుంటుంది అంతే తప్ప వాళ్ళు వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి మరి వాళ్ల గురించి రాయడం అనేది కరెక్ట్ కాదు అంటూ నెగిటివ్ గా రాసే వాళ్ళకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మాకు సున్నితమైన మనస్తత్వాలు ఉంటాయి ప్రేమించిన వాళ్ళు గానీ లేదా పెళ్లి చేసుకున్న వాళ్లు గాను విడిపోయారు అంటే దానికి తగిన కారణాలు దానికి ఉంటాయి మా మధ్య జరిగిన కొన్ని విభేదాల వల్ల అలా విడిపోయి బతక్లసి వస్తుంది అలా విడిపోయి బతకడం తప్పేమీ కాదు.

ఇద్దరి మనస్తత్వాలు ఒకటిగా కలవనప్పుడు విడిపోయి బతకడం మంచిది అని మేము అనుకుంటాం మా మీద ఇష్టం వచ్చినట్టుగా రాయడం అనేది కరెక్ట్ కాదు. అంటూ ఆమె కొంచెం ఘాటుగానే స్పందించింది…నిజానికి ఎప్పుడు లేని విధంగా రేణు దేశాయ్ ఇంత ఘాటుగా స్పందించడానికి గల కారణం ఏంటి అంటే ఇటీవల ఆమె రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్ర లో నటించింది. ఆ క్యారెక్టర్ లో ఆమె బడుగు బలహీన వర్గాలను ఆదరించడానికి వచ్చిన ఒక నాయకురాలు పాత్రలో నటించినందుకు గాను ఒక వ్యక్తి ఆమెను ఉద్దేశించి చాలా రకాలైన కామెంట్లు చేశాడు.ఇక దానివల్లే ఆమె ఇలా మాట్లాడింది.

అలాగే ఆడవాళ్ళని తక్కువగా చేసి చూడకండి అలాగే తక్కువ చేసి మాట్లాడకండి అంటూ ఆ వీడియోలో ఆమె గురించి మాట్లాడిన వ్యక్తి కి అర్థమయ్యేలా చాలా స్ట్రాంగ్ కౌంటర్లు వేసింది. ఏది ఏమైనా హీరో హీరోయిన్లు అంటే తెర మీద వరకే చూడండి. వాళ్ల పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూడడం కరెక్ట్ కాదు అంటూ ఆ పోస్ట్ లో స్ట్రాంగ్ గా మెన్షన్ చేసింది. ఇక దీంతో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అది వైరల్ గా మారింది.