https://oktelugu.com/

డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇకనైనా మారండి !

కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. థియేటర్లు కూడా అందుబాటులోకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. కాకపోతే, మరో రెండు నెలలు వరకు థియేటర్ బిజినెస్ ఫామ్ లోకి రాదు. అందుకే, కొంత మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఓటీటీ వ్యవహారం పై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ వర్కర్లు సీరియస్ అవుతున్నారు. అందుకే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ లో […]

Written By: , Updated On : July 8, 2021 / 11:19 AM IST
Follow us on

కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. థియేటర్లు కూడా అందుబాటులోకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. కాకపోతే, మరో రెండు నెలలు వరకు థియేటర్ బిజినెస్ ఫామ్ లోకి రాదు. అందుకే, కొంత మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఓటీటీ వ్యవహారం పై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ వర్కర్లు సీరియస్ అవుతున్నారు.

అందుకే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ లో అధ్యక్షుడు మురళి మోహన్ మాట్లాడుతూ ‘నిర్మాతలు ఎవరూ ఇప్పుడే ఓటీటీలకు వెళ్ళకండి అని బలంగా ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇది బాగానే ఉంది. మరి అప్పులు చేసి సినిమాలు చేసిన నిర్మాతల ఆర్థిక కష్టలను మురళీమోహన్ తీరుస్తాడా ? అక్టోబర్ 30 వరకూ వేచి చూడండి అని మురళీమోహన్ చెప్పడం కూడా మరీ విచిత్రంగా ఉంది.

అసలు అప్పటికి కూడా పరిస్థితులు సద్దుమణగక పోతే.. ఏమి చేయాలి. ఇప్పుడు అంటే ఓటీటీ రూపంలో నిర్మాతలకు ఓ అవకాశం వచ్చింది. నష్టపోకుండా బయట పడటానికి మంచి అవకాశం దొరికింది. అది వదిలేసుకొని అక్టోబర్ వరకు ఎందుకు ఎదురు చూడాలి. సినిమా నిర్మాణం అనేది సేవ కాదు కదా ? డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు బతకాలి అని చెప్పి నష్టపోవడానికి !

అయినా బతకడానికి కూడా కష్టపడుతున్నప్పుడు వాళ్ళంతా ఎందుకు ఇంకా ఈ పనినే పట్టుకొని వెళ్లాడటం ? థియేటర్ వ్యవస్థకి ఎలాగూ భవిష్యత్తు లేదని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయినా మేము బతకాలి, మీరు కోట్లు నష్టపోయినా మాకు అనవసరం.. సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయాలి అనడం దిక్కుమాలిన డిమాండ్.

సినిమా అంటే బిజినెస్. తెలివి తేటలు ఉన్నోడు మాత్రమే ఇక్కడ నిలబడతాడు. దాని బట్టి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తమ భవిష్యత్తు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఇలా చెప్పదానికి వినడానికి కూడా కఠినంగానే ఉంటుంది. కానీ వాస్తవాన్ని అంగీకరించి ముందుకు వెళ్లడం విజ్ఞుల లక్షణం అనిపించుకుంటుందని మరవొద్దు.