Mahesh Babu: చాలామంది దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలను చేసి వాళ్ళకి ఒక కొత్త ఐడెంటిటిని క్రియేట్ చేయాలని చూస్తుంటారు. అది కొన్నిసార్లు వర్కౌట్ అయితే మరి కొన్నిసార్లు బెడిసి కొడుతుంది. కాబట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు వల్ల ఇమేజ్ చూసుకొని వాళ్ళ అభిమానులు తమ హీరోను ఎలా చూడాలనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని సినిమాలు చేస్తే బాగుంటుంది. ఈ విషయాన్ని చాలా మంది విమర్శకులు చెప్పిన ప్రతి దర్శకులు పట్టించుకోవడం లేదు. కారణం ఏంటంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో దొరికినప్పుడు మాస్ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలి. అలా కాకుండా కొంతమంది దర్శకులు వాళ్ళకి నచ్చినట్టుగా సినిమాలను చేసి డిజాస్టర్ లను మూటగట్టుకున్నారు.
ముఖ్యంగా మురుగదాస్ లాంటి దర్శకుడు మహేష్ బాబు దొరికితే తుపాకీ లాంటి ఒక సీరియస్ కాప్ సినిమాని చేయకుండా స్పైడర్ లాంటి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాని చేసి డిజాస్టర్ ను కట్టబెట్టాడు. ఇక అలాంటి సందర్భంలోనే మహేష్ బాబు మరి కొంతమంది దర్శకులను నమ్మే ప్రయత్నం కూడా చేయడం లేదు…
శ్రీకాంత్ అడ్డాల లాంటి దర్శకుడు సైతం మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం లాంటి ఒక నాసిరకపు కథతో సినిమా చేసి డిజాస్టర్ ని అందించాడు. లాంటి ఒక రొటీన్ సినిమా చేశాడు. అందుకే మహేష్ బాబు ఇప్పుడు ఏ దర్శకుడుని గుడ్డిగా నమ్మడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని అతను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరి సినిమాలకు కమిట్ అవుతున్నాడు…
ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మహేష్ బాబు పాన్ వరల్డ్ ఇండస్ట్రీని శాసించే హీరోగా మారిపోతాడు. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…ఇక వారణాసి సినిమా తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు…కానీ కొంతమంది దర్శకులు చెప్పిన కథలను వింటున్నాడు…