Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయిన డైలాగులను సినిమాల్లో వాడుతున్నారు… ఇప్పటికే గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి అనే ఫేమస్ డైలాగ్ ని పాటగా మార్చి తెరకెక్కించారు. ఇక ఇంతకుముందు బాలయ్య బాబు భగవంత్ కేసరి సినిమాలో కూడా కెసిపిడి అనే డైలాగ్ ని వాడారు. అలాగే అఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అఖిల్ విషయంలో అయ్యగారు అనే డైలాగును వాడారు. ఇక అలాగే కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలో అగ్గిపెట్టి మచ్చ డైలాగులు వాడారు ఇలా ప్రతి సినిమా మీద హైప్ తీసుకురావడానికి జనంలో ఎక్కువగా పాపులర్ అయిన డైలాగులను సినిమాల్లో ఏదో ఒక రూపంలో పెట్టి సినిమా మీద మంచి అంచనాలైతే పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే సినిమాల్లో వాటిని చూసిన ప్రేక్షకులు కూడా వాటికి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఇక అందులో భాగంగానే వీటివల్ల కొన్ని సినిమాల మీద అంచనాలైతే భారీగా పెరుగుతున్నాయి. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన సంపాదించుకున్న కొంతమందిని సినిమాల్లో కూడా కొన్ని సీన్లు రాస్తూ వాళ్లను కూడా సినిమాలో నటింపచేస్తున్నారు. దీని వల్ల కూడా సినిమాలకి చాలా మైలేజీ వస్తుంది మొత్తానికి ఇప్పుడున్న మేకర్స్ ఏదో ఒక జిమ్మిక్కు చేసి సినిమా మీద అంచనాలను పెంచి సక్సెస్ కొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం స్టార్ హీరోలు కూడా సోషల్ మీడియా లో హైలైట్ అయిన వీడియోలను డైలాగులను వాడుతు సక్సెస్ లను కొడుతూ వస్తున్నారు… ఇక ఇంతకుముందు సక్సెస్ సాధించిన సినిమాల స్పూఫ్ లను వాడుతూ సక్సెస్ లను కొట్టేవారు కానీ ఇప్పుడు ఫేమస్ అయిన డైలాగులను వాడుతున్నారు ఇక మారుతూన్న ట్రెండ్ ని బట్టి దానికి అనుగుణంగా సినిమాలను తీస్తూ సినిమాల్లో కొన్ని విజువల్స్ వాడుతూ సినిమాల పైన భారీ అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు…
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని సాంగ్ మంచి అంచనాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. కుర్చీ మడతపెట్టి అని ఇంతకుముందు ఒక ముసలైన చేసిన కొన్ని కామెంట్ల వల్ల డైలాగ్ అనేది బాగా ఫేమస్ అయింది ఇప్పటికే దాన్ని చాలా షోలలో యూట్యూబ్ లో కూడా బాగా వాడారు. అయితే అది జనాల్లో బాగా ఇమిడిపోయింది కాబట్టి దానిని సాంగ్ గా మార్చామంటూ చిత్ర యూనిట్ కూడా ఈమధ్య దానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేసింది…