ULFA : ఉల్ఫాతో శాంతి ఒప్పందం అస్సాం చరిత్రలో అతి ముఖ్య ఘట్టం

ఉల్ఫాతో శాంతి ఒప్పందం అస్సాం చరిత్రలో అతి ముఖ్య ఘట్టం.. దీని చరిత్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : December 30, 2023 5:08 pm

ULFA : నిన్న అస్సాం రాష్ట్రానికి సంబంధించి త్రైపాక్షిక శాంతి ఒప్పందం జరిగింది. ‘ఉల్ఫా’ అనే ఉగ్రవాద సంస్థతో కేంద్రప్రభుత్వం, అస్సాం రాష్ట్రంతో కలిసి ఒక ఒప్పందం చేసుకుంది. దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అన్నది కొత్తతరం వరకూ తెలియదు.

ఒకప్పుడు ఈశాన్య భారతదేశం మొత్తం అస్సాం కింద ఒకే రాష్ట్రంగా ఉండేది.. త్రిపుర, మణిపూర్ తప్పితే మొత్తం అస్సాంగా ఉన్న ప్రాంతాన్ని చిన్న చిన్న రాష్ట్రాలుగా విడగొట్టారు. ఇప్పుడున్న మిగిలిపోయిన అస్సాం కూడా ఇప్పుడు చాలా పెద్ద రాష్ట్రం. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో సపరేట్ దేశం కావాలంటూ నాగాలాండ్, అసోం,సహా పలు రాష్ట్రాల్లో కొద్ది సంవత్సరాలుగా ఉద్యమాలు సాగుతున్నాయి.

1979లో శివసాగర్ లో రన్ ఘర్ లో 20 మంది యువకులు కలిసి ఈ ఉల్ఫాను స్ట్రాట్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసవాదులు వచ్చి అసోం కల్చర్ ను నాశనం చేశారు. అసోం సంస్కృతిని చెడగొడుతున్నారు. 20 మంది యువకులు తుపాకీలతో పోరాటం చేశారు. ఈ 20 మందితోనే నాడు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అసోం సంస్కృతి కోసం వీరు పోరాడుతున్నారు. అసోంలో వీళ్లకు తెలియకుండా ఏం జరిగేది కాదు.. కిడ్నాప్ లు, హత్యలు చోటు చేసుకున్నాయి. 1990 నాటికి భరించలేని స్థితికి అసోంలో పరిస్థితులున్నాయి. దీంతో భారత ఆర్మీ రంగంలోకి దిగి ఉల్ఫా తీవ్రవాదులను ఏరివేసింది. ఆపరేషన్ భజరంగ్ పేరిట ఈ ఆపరేషన్ చేపట్టారు. చివరకు దీనివల్ల సాధించలేమని అనుకొని 8వేల మంది మిలిటెంట్లు లొంగిపోయారు.

ఉల్ఫాతో శాంతి ఒప్పందం అస్సాం చరిత్రలో అతి ముఖ్య ఘట్టం.. దీని చరిత్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.