Prabhas: మన టాలీవుడ్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రస్తుతం ఆయన కేవలం టాలీవుడ్ కి మాత్రమే కాదు..అన్ని ప్రాంతీయ భాషలకు సంబంధించిన స్టార్ హీరో..ఆయన పేరే కొన్ని కోట్ల రూపాయిల బిజినెస్ చేస్తుంది..అలాంటి స్టార్ సినిమా చెయ్యాలని ప్రతి ఒక్క హీరోయిన్ కి మరియు క్యారక్టర్ ఆర్టిస్టు కి ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..

కానీ కొంతమంది ప్రభాస్ పేరు ని వాడుకొని ఇండస్ట్రీ లో కొంతమంది హీరోయిన్స్ ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు..అలాంటి సంఘటనే ఇటీవల ఒక్కటి వెలుగులోకి వచ్చి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇక అసలు విషయానికి వస్తే టాలీవుడ్ యువ హీరోయిన్స్ లో ఒక్కరు అయినా రేఖా భోజ్ తనకి ఇండస్ట్రీ లో ఎదురు అయినా ఒక్క చేదు అనుభవం ని సోషల్ మీడియా లో చెప్తూ విడుదల చేసిన ఒక్క వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది..

Also Read: CM KCR Delhi Tour: కేసీఆర్ చలో ఢిల్లీ.. దేశవ్యాప్త పర్యటనకు ప్రణాళిక.. ఇక జాతీయ రాజకీయాలకే ఫిక్స్
2016 సంవత్సరంలో ఒక యువ డైరెక్టర్ ప్రభాస్ అసిస్టెంట్ అని చెప్పి తనకు కాల్ చేశాడని,నువ్వు ప్రభాస్ కి వీరాభిమాని అవ్వడం తో నీ గురించి ఆయనకీ చెప్పానని..ఆయన నిన్ను కలవడానికి నోవొటెల్ హోటల్ లో ఎదురుచూస్తున్నారు తొందరగా వెళ్లి ప్రభాస్ ని కలవండి అని చెప్పడం తో అక్కడికి వెళ్లి చూస్తే ఎవ్వరు లేరు అని ఆమె చెప్పుకొచ్చారు..ఇందులో ఎంత వరుకు నిజం ఉందొ తెలుసుకోవడానికి ప్రభాస్ గారి ఆఫీస్ కి కాల్ చేస్తే, ప్రభాస్ గారి అసిస్టెంట్ ప్రభాస్ శ్రీను అసలు ఇండియాలోనే లేదు అని, ఆయన అమెరికా లో ఉన్నాడు అని , ఆయన ఇక్కడికి తిరిగి రావడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది అని చెప్పారు..
దీనితో ఒక్కసారిగా షాక్ కి గురి అయినా రేఖ భోజ్, ఇండస్ట్రీ లో అవకాశాలు సంపాదించుకుంటున్న తననే ఇలా పెద్ద హీరోల పేరు చెప్పి మోసం చెయ్యాలని చూస్తూ ఉంటె, ఇక సామాన్యులు ఇలా నమ్మి ఎంత మంది మోసపొయ్యి ఉంటారో అని చెప్పుకొచ్చింది రేఖ భోజ్.. ప్రభాస్ పేరు ని వాడుకొని తనని ట్రాప్ చెయ్యడానికే ఆ డైరెక్టర్ ఇలా చేసాడు అని..అతను ఇప్పుడు ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గానే కొనసాగుతున్నాడు అని, అతని పేరు చెప్పడానికి తనకి ఇష్టం లేదు అని చెప్పుకొచ్చారు రేఖా భోజ్.
Also Read: Narayana Bail: నారాయణకు బెయిల్ రావడానికి సహకరించింది ఎవరు?