Director Teja Comments About Balagam Venu: చిత్రం, నువ్వు నేను, జయం లాంటి వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న యాక్టర్ తేజ… కెరియర్ మొదట్లో పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఆయన స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న ఈ దర్శకుడు మొదటి నుంచి కూడా చాలా మంది కొత్త యాక్టర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అందులో బలగం వేణు కూడా ఒకరు కావడం విశేషం… రీసెంట్ గా తేజ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బలగం వేణు గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. జై సినిమాలో అతన్ని ఒక చిన్న క్యారెక్టర్ కోసం తీసుకున్నానని ఆయన యాక్టింగ్ చాలా బాగుందని చెప్పాడట. ఆ సినిమా షూట్ చేస్తున్న సందర్భంలో వేణుని పిలిచి అతని భుజం మీద చేయి వేసి ఈ సినిమాలో యాక్టింగ్ బాగా చేయి నీకు చాలా మంచి అవకాశాలు వస్తాయని తేజ చెప్పాడట. అప్పుడు బలగం వేణు కన్నీళ్లు పెట్టుకున్నాడని అదేంటి ఏడుస్తున్నావ్ అని తేజ అడగగా ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ కూడా వస్తుందా? రాదా అని భయపడ్డాను సార్…
Also Read: ఇక విద్యార్థులే జగన్ నమ్మకమట!
అలాంటిది మీరు నా భుజం మీద చేయి వేసి మాట్లాడుతుండడం చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ చెప్పారట. మొత్తానికైతే బలగం వేణు చాలా సంవత్సరాల పాటు కమెడియన్ గా తన కెరీర్ ని ముందుకు సాగిస్తూనే గత రెండు సంవత్సరాల క్రితం బలగం సినిమాతో దర్శకుడిగా మారి భారీ సక్సెస్ ని సాధించాడు.
మొత్తానికైతే ఆయన సాధించిన ఈ విజయం చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. ప్రస్తుతం ఆయన దిల్ రాజు బ్యానర్ లోనే ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక దాని కోసం తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు… తేజ లైఫ్ ఇచ్చిన వాళ్లలో వేణు కూడా ఒకరు కావడం విశేషం…
నిజానికి మొదటి నుంచి కూడా తేజ చాలామంది కొత్త వాళ్లకు అవకాశాలను ఇస్తూనే నన్ను వాడుకొని సినిమాలో బాగా నటించి మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళండి అని చెబుతూ ఉంటాడట. అందువల్లే తేజ నుంచి వచ్చిన చాలామంది యాక్టర్లు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకొని టాప్ యాక్టర్స్ గా ముందుకు సాగుతున్నారు…