Homeట్రెండింగ్ న్యూస్Monkeypox: ప్రపంచంపైకి మరో మహమ్మారి.. 59 దేశాలకు హెచ్చరిక

Monkeypox: ప్రపంచంపైకి మరో మహమ్మారి.. 59 దేశాలకు హెచ్చరిక

Monkeypox: ప్రపంచంలో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న ప్రజలకు మరో నూతన వైరస్ ఆందోళన కలిగిస్తోంది. కరోనా నాలుగో దశ ప్రారంభమైందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీనికి తోడు కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఏం చేయాలో తోచడం లేదు. ఫలితంగా ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలవుతున్నారు. రోజువారి కేసుల సంఖ్య పెరగడంత ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రజానీకం వైరస్ కట్టడిపైనే దృష్టి సారించాల్సి వస్తోంది. వైరస్ దెబ్బకు కంటి మీద కునుకులేకుండా పోతోంది.

Monkeypox
Monkeypox

ఈ నేపథ్యంలో మరో కొత్త రకం వైరస్ మంకీపాక్స్ విజృంభిస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే 59 దేశాలకు విస్తరించింది. దాదాపు ఆరు వేల మందికి సోకినట్లు వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇంకా ఈ వ్యాధితో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మంకీపాక్స్ కేసుల్లో 66 శాతం పెరుగుదల నమోదు అవుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

Also Read: Amazing scenery in Telangana : తెలంగాణలో ఈ అద్భుత దృశ్యం.. మిస్ అయితే మీరు అన్ లక్కీనే!

మంకీపాక్స్ స్వలింగ సంపర్కుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇతరులకు ఇంకా సోకలేదు. దీంతో భయపడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.ఇవి కూడా ఐరోపా, ఆఫ్రికా దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఇతర ఖండాల వారు భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఇప్పటికి 6027 కేసులు నమోదు కాగా ఒక వారంలోనే 2614 కేసలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మరణించిన వారు కూడా ఆఫ్రికా ఖండానికి చెందిన వారే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Monkeypox
Monkeypox

మంకీపాక్స్ కేసులు ఎనభై శాతం యూరప్ దేశాల్లోనే నమోదవుతున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. జులై మూడో వారంలో నిపుణులతో సమావేశమై వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలపై చర్చించడం జరుగుతుంది. వైరస్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు. మంకీపాక్స్ విస్తరణను అడ్డుకోవాలని ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read:Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ట్రంప్ లాంటి వాడేనా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version