Director Shankar: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు శంకర్… ఈయన రోబో సినిమా నుంచి ప్రతి సినిమాలో కూడా గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండేవిధంగా చూసుకుంటూ వస్తున్నాడు. ఇక ఆ రకంగానే ఆయన రోబో సినిమా తర్వాత అసలు ఒక్క సక్సెస్ ను కూడా అందుకోలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటి అంటే ఆయన విజువల్ గా సినిమాని చాలా రిచ్ గా చూపించినప్పటికీ కథ పరంగా మాత్రం చాలా వరకు అశ్రద్ధ చేస్తున్నాడు. అని ఆయన సినిమాలను చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు.
దీనికి కారణం ఏంటి అంటే శంకర్ కథల విషయంలోనే చాలా రకాల లోపాలు జరుగుతున్నాయంటూ సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. నిజానికి శంకర్ మంచి దర్శకుడే కానీ మంచి కథకుడు కాదు అనే విషయం మనకు తెలిసిందే. ఆయన తన దగ్గర ఉన్న ఒక లైన్ ని తన రైటింగ్ టీమ్ కి చెప్తాడు. ఆ లైన్ మీదనే ఆ రైటర్స్ సినిమా మొత్తాన్ని రాసుకుంటూ వస్తారు. ‘జెంటిల్ మెన్’ సినిమా నుంచి ‘రోబో’ సినిమా వరకు శంకర్ దగ్గర ‘సుజాత రంగనాథన్’ అనే ఒక రైటర్ ఉండేవాడు. ఆయన రాసిన కథ కూడా శంకర్ కి సరిగ్గా సెట్ అయ్యేది. అలాగే శంకర్ ఎలాంటి అంశాలను కావాలనుకుంటున్నాడో దానికి డబల్ రేంజ్ లో ఆయన ఆ కథలో ఎలివేషన్స్ ను గాని, ఎమోషన్స్ ను గాని ఇంక్లూడ్ చేస్తూ ఆ కథ కి ఒక రూపకల్పన చేసేవాడు. కానీ ఇప్పుడు తన దగ్గర ఉన్న రచయితల్లో అంత స్టఫ్ అయితే లేనట్టుగా తెలుస్తుంది.
ఇక రోబో సినిమా తర్వాత సుజాత రంగనాథన్ అనే రచయిత చనిపోవడం శంకర్ కి భారీ దెబ్బకొట్టింది. నిజానికి సుజాత ఉన్నట్టైతే శంకర్ టాప్ డైరెక్టర్ గా కొనసాగేవాడు అంటూ మరి కొంతమంది కూడా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఏదైనా కూడా శంకర్ తన మార్కు చూపించడంలో వెనుకబడి పోవడాన్ని తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శంకర్ కి తమిళ్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా అభిమానులు ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే. ఇంకా తెలుగులో అయితే చాలా మంది శంకర్ కి డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు శంకర్ కి అర్జెంటుగా ఒక రైటర్ అవసరమైతే ఉంది. కాబట్టి ఆ రైటర్ ని తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిది అంటూ చాలామంది శంకర్ కి సలహాలనైతే ఇస్తున్నారు. మరి శంకర్ కూడా ఇక మీదట వచ్చే సినిమాలను భారీ రేంజ్ లో తెరకెక్కించాలంటే మాత్రం తన దగ్గర అద్భుతమైన కథ ఉండాలి. ఇక ఎన్ని రోజులు అదే కరప్షన్ మీద కథను నడిపిస్తాడు. ఒక కొత్త కథ అనేది వస్తేనే శంకర్ సినిమా అనేది ముందుకు సాగుతుంది. కాబట్టి అలాంటి కొత్త కథ కోసం శంకర్ ప్రయత్నం చేయాలి.
కావాలంటే ఒక గొప్ప రైటర్ ని కూడా రిక్రూట్ చేసుకోవాలి అంటూ ఆయన అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన సక్సెస్ కొడితే చూడాలని 10 సంవత్సరాల నుంచి తన అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నప్పటికీ శంకర్ మాత్రం ప్రతిసారి నిరాశ పరుస్తూనే వస్తున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ‘భారతీయుడు 2’ తో కూడా మరోసారి నిరశపరిచాడు అంటూ చాలా మంది శంకర్ ఫ్యాన్స్ వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…