https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం కెరియర్ ను త్యాగం చేస్తున్న డైరెక్టర్లు వీళ్లేనా..?

Pawan Kalyan: త్రివిక్రమ్ చాలా వరకు తన సినిమాలను చాలా స్లోగా చేస్తాడనే ఒక రూమర్ అయితే ఆయన మీద ఉంది. అయినప్పటికీ ఆయన అలా సినిమాలు చేయడానికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన స్టోరీ సెలక్షన్స్ ని తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు.

Written By: , Updated On : July 15, 2024 / 02:26 PM IST
Are these the directors who are sacrificing their careers for Pawan Kalyan

Are these the directors who are sacrificing their careers for Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ప్రస్తుతం చిరంజీవిని మించిన స్టార్ డమ్ తో ఇండస్ట్రీలో ఒక గొప్ప పేరునైతే సంపాదించుకున్నాడు. అటు పాలిటిక్స్ లోను, ఇటు సినిమాల్లోను రెండింటిలోనూ బిజీగా కొనసాగుతున్న ఆయన తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక పాలిటిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టిన ఆయన డిప్యూటీ సీఎం గా తన పదవి భాధ్యతలను కూడా కొనసాగిస్తూనే సినిమాలు చేయడానికి కూడా సమయాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన్ని నమ్మి కెరియర్ ను కోల్పోయిన దర్శకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పుకోవాలి. త్రివిక్రమ్ చాలా వరకు తన సినిమాలను చాలా స్లోగా చేస్తాడనే ఒక రూమర్ అయితే ఆయన మీద ఉంది. అయినప్పటికీ ఆయన అలా సినిమాలు చేయడానికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన స్టోరీ సెలక్షన్స్ ని తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇక వేరే భాషల్లో సక్సెస్ అయిన సినిమాలను పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా రాసి వాటిని తొందరగా సెట్స్ మీదకు తీసుకెళ్లి సినిమాకు దర్శకుడుని కూడా తనే సెట్ చేసి మొత్తానికైతే ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ నటించే విధంగా అన్ని ఆయనే తయారు చేస్తున్నాడు. అందువల్లే తన సొంత సినిమాలని లేట్ చేసుకుంటూ చాలా వరకు తన కెరియర్ ను కోల్పోతున్నాడు అంటూ త్రివిక్రమ్ మీద చాలా విమర్శలైతే వస్తున్నాయి.

ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కోసమే త్రివిక్రమ్ చాలా వరకు కష్టపడ్డాడు, ఇంకా కష్టపడుతున్నాడనే చెప్పాలి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో తెలియజేయడం విశేషం… ఇక పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కోసం త్రివిక్రమ్ మహేష్ బాబు తో చేయాల్సిన ‘గుంటూరు కారం’ సినిమాను కూడా లేట్ చేశాడనే వార్తలైతే అప్పట్లో విపరీతంగా వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ కొంచెం సిన్సియర్ గా తన స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది… ఇక వీళ్ళతోపాటుగా హరీష్ శంకర్, క్రిష్ లాంటి దర్శకులు కూడా పవన్ కళ్యాణ్ వల్ల చాలా వరకు కెరియర్ ను ఫైనాన్షియల్ గా గాని, సక్సెస్ లా పరంగా గాని నష్టపోయారనే చెప్పాలి.

నిజానికి క్రిష్ ‘హరిహర వీరమల్లు’ సినిమాని పవన్ కళ్యాణ్ తో గత నాలుగు సంవత్సరాలు క్రితమే మొదలు పెట్టాడు. ఈ సినిమాని మొదట రెండు పార్టులుగా చేయాలి అనుకున్నారట. అలాగే మొదటి పార్ట్ ను 2021 లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా పాండమిక్ సిచువేషన్ వల్ల అది కొంతవరకు లేట్ అయింది. అయినప్పటికీ ఆ తర్వాత నుంచి సినిమా షూట్ లోకి పవన్ కళ్యాణ్ వస్తాడా అనుకుంటే ఆయనకు ఉన్న పాలిటిక్స్ బిజీ వల్ల ఆయన సినిమా షూటింగ్ లో ఎక్కువగా పాల్గొనలేకపోయారు. దానివల్ల క్రిష్ కెరియర్ అనేది చాలా వరకు కోల్పోయారనే చెప్పాలి. ఇక అందుకే ఆయన హరిహార వీరమల్లు సినిమా నుంచి అఫీషియల్ గా తప్పుకున్నాడు.

ఇక హరీష్ శంకర్ కూడా 2019 వ సంవత్సరంలో వరుణ్ తేజ్ తో చేసిన ‘గద్దల కొండ గణేష్’ సినిమా తర్వాత మరొక సినిమాను రిలీజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన దగ్గర వేరే స్క్రిప్ లు ఉన్నా కూడా వాటిని హోల్డ్ లో పెట్టి ఈ సినిమాని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ బిజీలో ఉండటం వల్ల ఇక హరీష్ శంకర్ కూడా రవితేజ తో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమాను చేస్తున్నాడు. మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ సినిమా షూటింగుల్లో పాల్గొని ఫినిష్ చేసి వీళ్ళని ఆదుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…