https://oktelugu.com/

RC15: చెర్రీతో అదిరే యాక్షన్​ సీన్స్​ ప్లాన్​ చేస్తున్న శంకర్​

RC15: మెగాపవర్​స్టార్ రామ్​చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. ఇందులో చెర్రితో పాటు ఎన్టీఆర్​ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ప్రోమోలు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి . ఇదిలా ఉండగా, మరోవైపు మెగాపవర్​ స్టార్​ రామ్​చరణ్ హీరోగా.. దర్శకుడు శంకర్​ ఓ భారీ పాన్​ ఇండియా సినిమాకు తెరలేపారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​ షెడ్యూల్​ కూడా మొదలైంది. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 21, 2021 / 12:13 PM IST
    Follow us on

    RC15: మెగాపవర్​స్టార్ రామ్​చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. ఇందులో చెర్రితో పాటు ఎన్టీఆర్​ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ప్రోమోలు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి . ఇదిలా ఉండగా, మరోవైపు మెగాపవర్​ స్టార్​ రామ్​చరణ్ హీరోగా.. దర్శకుడు శంకర్​ ఓ భారీ పాన్​ ఇండియా సినిమాకు తెరలేపారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​ షెడ్యూల్​ కూడా మొదలైంది. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రెండో షెడ్యూల్​ కూడా ప్రారంభమైంది.

    కాగా, తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రస్తుతం చరణ్​ పర్సనాలిటీకి తగ్గట్లు శంకర్​ భారీ ఫైట్​సీన్స్​ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే అందులోని ఫైటర్స్ వీరేనంటూ.. కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్​ అవుతున్నాయి. ఒకవేళ ఈ వార్తల్లో నిజముంటే మాత్రం.. వీరిద్దరి కాంబోలో యాక్షన్స్ విజువల్స్ వేరే లెవెల్​లో ఉండనున్నట్లు తెలుస్తోంది.

    ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్​తో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్​ లెవెల్​లో ఉన్నాయి. ఈ చిత్రంలో కియారా హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం ఇస్తున్నారు. దిల్​ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు రోబోతో భారీ హిట్​ కొట్టిన శంకర్​. ఆతర్వాత వచ్చిన ఐ, రోబో2.0 సినిమాలు భారీ డిజాస్టర్​ను మూటకట్టుకున్నాయి. దీంతో శంకర్​- చెర్రి కాంబినేషన్​లో వచ్చే సినిమా ఎలా ఉండబోతోందనే విషయంపై అనేక ఊహాగానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.