https://oktelugu.com/

Kaikala Satyanarayana: కైకాల ఆరోగ్య పరిస్థితిపై చిరు ఆసక్తికర ట్వీట్​

Kaikala Satyanarayana: ప్రముఖ టాలీవుడ్​ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శనివారం ఉదయం అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన.. ప్రస్తుతం వెంటీలేటర్​పై చికిత్స తీసుకుంటున్నారు. కాగా, కైకాల ఆరోగ్య పరిస్థితిపై తాజాగా, మెగాస్టార్​ చిరంజివి స్పందించారు. సత్యనారాయణతో తాను ఫోన్​లో మాట్లాడినట్లు తెలిపారు. తనతో మాట్లాడుతూ.. ఆనందం వ్యక్తం చేశారని అన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికంగా పంచుకున్నారు చిరు. #GetWellSoonKaikalaGaru #KaikalaSatyanarayana#NavaRasaNatanaSarvabhouma pic.twitter.com/Log3ohKtnz — Chiranjeevi Konidela (@KChiruTweets) […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 21, 2021 / 12:29 PM IST
    Follow us on

    Kaikala Satyanarayana: ప్రముఖ టాలీవుడ్​ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శనివారం ఉదయం అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన.. ప్రస్తుతం వెంటీలేటర్​పై చికిత్స తీసుకుంటున్నారు. కాగా, కైకాల ఆరోగ్య పరిస్థితిపై తాజాగా, మెగాస్టార్​ చిరంజివి స్పందించారు. సత్యనారాయణతో తాను ఫోన్​లో మాట్లాడినట్లు తెలిపారు. తనతో మాట్లాడుతూ.. ఆనందం వ్యక్తం చేశారని అన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికంగా పంచుకున్నారు చిరు.

    ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తెలిసిన వెంటనే.. డాక్టర్ సాయంతో ఫోన్​లో మాట్లాడినట్లు తెలిపారు. అప్పుడే ఆయన త్వరగా కోలుకుంటారనే పూర్తి నమ్మకం కలిగిందని అన్నారు. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, త్వరగా కోలుకుని మీరు ఇంటికి తిరిగి రావాలి, అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలి. అని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్‌అప్‌ సైగ చేశారు. అని చిరు తెలిపారు.

    సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆయన తిరిగి ఇంటికి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులతో ఈ విషయం పంచుకోవడం సంతోషంగా ఉందని చిరు అన్నారు. సత్యనారాయణతో చిరుకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. చిరు సినిమాల్లో కైకాల కీలక పాత్రలు పోషించారు. యముడికి మొగుడు, గ్యాంగ్​లీడర్​, బావగారు బాగున్నారా వంటి సినిమాల్లో వీరిద్దరి కాంబినేషన్​ ముచ్చట గొలిపింది.