https://oktelugu.com/

Animal Movie : అనిమల్ పార్క్ సినిమా ఎప్పుడు ఉంటుంది… రన్బీర్ తో పాటు ఇంకా ఎంత మంది హీరోలు ఇందులో భాగం కాబోతున్నారు…

సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ ముందుకు దూసుకెళ్తుంటారు. ఇక అందులో కొంతమంది దర్శకులు చేసిన సినిమాలు సక్సెస్ అయితే మరి కొంతమంది చేసిన సినిమాలు ప్లాప్ లుగా మిగిలిపోతూ ఉంటాయి. ఇక ఏది ఏమైనా కూడా సక్సెస్ అనేది ఇక్కడ అందరికి చాలా కీలకమనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 17, 2024 / 09:13 AM IST

    Animal Park

    Follow us on

    Animal Movie :  సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో గత సంవత్సరం ‘అనిమల్ ‘ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఒక్కసారిగా సందీప్ రెడ్డి వంగ పేరు ఇండియాలో మారు మ్రోగిపోయిందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్బంలో ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి కూడా క్రియేట్ చేసుకున్నారు. మరిలాంటి ఒక స్టార్ డైరెక్టర్ తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో నిజంగా చాలా వరకు హెల్ప్ చేశారనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచి మన సినిమాల్లో కంటెంట్ ఎలా ఉంటుందో అందరికి తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు. తన తదుపరి సినిమాని రన్బీర్ కపూర్ తో చేయడానికి సిద్ధమయ్యాడు. అనిమల్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘అనిమల్ పార్క్’ సినిమాను చేసి దాంతో కూడా మరొక సక్సెస్ కొట్టడానికి రెఢీ అవుతున్నాడు…మరి ఇది ఇలా ఉంటే ఈ సినిమాలే కాకుండా ఆయన మరికొన్ని సినిమాలను కూడా చేయడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నాడట… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమాలో స్టార్ హీరోలు కొంతమంది భాగం కాబోతున్నట్టుగా తెలుస్తోంది.

    నిజానికి విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, షారుక్ ఖాన్ లాంటి హీరోలను ఈ సినిమాలో భాగం చేస్తూ వాళ్ళ క్యారెక్టర్లను డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరూ చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించినప్పటికి ఈ సినిమాకి మంచి మైలేజ్ అయితే వస్తుందని వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇది ఏమైనా కూడా అలాంటి స్టార్ డైరెక్టర్ ఏ సినిమా చేసిన కూడా బిజినెస్ పరంగా ఆలోచిస్తూ సినిమా కంటెంట్ చెడగొట్టకుండా చేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన లాంటి దర్శకుడు తెలుగు సినిమా స్థాయిని పెంచుతుండడం విశేషమనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా సందీప్ ప్రస్తుతం తను చేసే సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు.

    ఇక తను చేసే సినిమాల్లో ఒక్క ఫెయిల్యూర్ కూడా ఉండకూడదనే ఉద్దేశ్యం తోనే ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు… ఇప్పటికే ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు. కానీ తను మాత్రం మన తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తుందనే చెప్పాలి..