https://oktelugu.com/

Victory Venkatesh : ఆ సెంటిమెంట్ కలిసొస్తే వెంకీనే సంక్రాంతి విన్నర్, రామ్ చరణ్, బాలయ్యలకు చుక్కలే!

2025 సంక్రాంతి చిత్రాలపై ఒక క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ బరిలో దిగుతున్నారు. ఒకటి రెండు చిన్న, డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా ఓ సెంటిమెంట్ రిపీట్ అయితే విక్టరీ వెంకటేష్ సంక్రాంతి విన్నర్ అవుతాడు. ఆ సెంటిమెంట్ ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : November 17, 2024 / 09:42 AM IST

    Victory Venkatesh

    Follow us on

    Victory Venkatesh :  oసెంటిమెంట్ అనేది మూఢ నమ్మకం. అయినప్పటికీ చాలా మంది ఈ సెంటిమెంట్స్ ని ఫాలో అవుతుంటారు. చిత్ర పరిశ్రమలో మరీ ఎక్కువ. హీరోలు, దర్శకులు, నిర్మాతలు కొన్ని సెంటిమెంట్స్ ని ఫాలో అవుతారు. 2014లో కోలీవుడ్ హీరోలు చవి చూసిన ఫలితాలు 2024లో రిపీట్ అవుతున్నాయట. 2014లో రజినీకాంత్ కి రెండు ప్లాప్స్ పడగా, ఈ ఏడాది కూడా లాల్ సలాం, వేట్టయన్ రూపంలో రెండు పరాజయాలు ఎదురయ్యాయి.

    సూర్య, విజయ్ తో పాటు పలువురు హీరోల విషయంలో 2014 తరహా ఫలితాలు 2024లో పునరావృతం అవుతున్నాయి. ఇది నమ్మలేని నిజం. కాగా 2025 సంక్రాంతి చిత్రాలపై ఒక స్పష్టత వచ్చేసింది. రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ సంక్రాంతి బరిలో ఉన్నారు. చిరంజీవి సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర సంక్రాంతికి విడుదల కావాల్సింది. ఆ మధ్య చిరంజీవి అనారోగ్యం కారణంగా ఓ నెల విశ్రాంతి తీసుకున్నారు. దాంతో విశ్వంభర షూటింగ్ కి ఆటంకం ఏర్పడింది. విశ్వంభర సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది.

    విశ్వంభర విడుదల ఆలస్యం కావడంతో డిసెంబర్ లో విడుదల కావాల్సిన గేమ్ ఛేంజర్ చిత్రాన్ని సంక్రాంతికి వాయిదా వేశారు. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కానుంది. ఇక బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న 109వ చిత్రం డాకు మహారాజ్. ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది. ఇటీవల అధికారికంగా ప్రకటించారు.

    అనిల్ రావిపూడి-వెంకటేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 14న విడుదల కానుందట. ఈ క్రమంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. 2019 సంక్రాంతికి సైతం రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ పోటీపడ్డారు. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎఫ్ 2 చిత్రాలు విడుదలయ్యాయి. బోయపాటి తెరకెక్కించిన వినయ విధేయ రామ, ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

    ఎఫ్ 2పై ప్రేక్షకుల్లో పెద్దగా హైప్ లేదు. కానీ వినయవిధేయరామ, ఎన్టీఆర్ కథానాయకుడు బోల్తా పడ్డాయి. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వినయ విధేయ రామ ప్లాప్ కాగా, ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అయ్యింది. ఎఫ్ 2 వసూళ్ల వర్షం కురిపించింది. చరణ్, బాలయ్యలకు షాక్ ఇస్తూ వెంకీ సంక్రాంతి విన్నర్ అయ్యాడు. మరి ఈ సెంటిమెంట్ రిపీట్ అయితే 2025లో సైతం వెంకీ సంక్రాంతి విన్నర్ అవుతాడు.