https://oktelugu.com/

Gabbar Singh: ‘గబ్బర్ సింగ్’ టికెట్స్ కోసం క్యూ లైన్ లో నిల్చున్న డైరెక్టర్ రాజమౌళి..వైరల్ అవుతున్న ఫోటో!

ఖుషి సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని గతంలో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా లో గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా రాజమౌళి గబ్బర్ సింగ్ సినిమా టికెట్స్ కోసం క్యూ లైన్ లో నిల్చున్న ఒక ఫోటో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు అభిమానులు. ఇది ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 29, 2024 / 04:22 PM IST

    Gabbar Singh(1)

    Follow us on

    Gabbar Singh: టాలీవుడ్ నుండి ఎంత మంది హీరోలైన పాన్ ఇండియా రేంజ్ కి ఎదగొచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ని మించిన సూపర్ స్టార్ లేరు అని ట్రేడ్ పండితులు అంటుంటారు. కేవలం పవన్ కళ్యాణ్ వెండితెర మీద కనిపిస్తే చాలు, సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే అభిమానులు ఆయనకి కోట్లలో ఉంటారు. అందుకే ఆయన ఎన్ని ఓటీటీ రీమేక్ సినిమాలు చేసినా చెక్కు చెదరని స్టార్ స్టేటస్ తో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఒక స్టార్ హీరో కి భారీ ఓపెనింగ్ రావాలంటే కచ్చితంగా పెద్ద డైరెక్టర్ తో చెయ్యాల్సిందే. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా కాదు. ఆయన చాలా తేలికగా ఎప్పటి నుండో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలను రీమేక్ చేసుకొచ్చి ఎవరికీ సాధ్యం కానీ ఓపెనింగ్ వసూళ్లను రాబడుతూ ఉంటాడు.

    అందుకే ఆయన్ని ట్రేడ్ పండితులు పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. కేవలం సామాన్యులలో మాత్రమే కాదు, సినీ సెలెబ్రిటీలలో కూడా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు. వారిలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకరు. ఈయన ఖుషి సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని గతంలో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా లో గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా రాజమౌళి గబ్బర్ సింగ్ సినిమా టికెట్స్ కోసం క్యూ లైన్ లో నిల్చున్న ఒక ఫోటో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు అభిమానులు. ఇది ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. సెప్టెంబర్ 2 వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ చిత్రం రీ రిలీజ్ అవుతుంది కదా, ఆ టికెట్స్ కోసం రాజమౌళి క్యూ లైన్ లో నిల్చున్నాడా అని మీరు అనుకోవచ్చు. కానీ అది లేటెస్ట్ ఫోటో కాదు, 2012 నాటిది. అప్పట్లో గబ్బర్ సింగ్ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో సినీ సెలెబ్రిటీలు అభిమానులుగా మారిపోయారు. వింటేజ్ పవర్ స్టార్ వెండితెర మీద, అభిమానుల సమక్షంలో చూసేందుకు ఎగబడ్డారు, వారిలో రాజమౌళి కూడా ఒకరు.

    ఈ ఫోటో ని ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ, ప్రపంచానికి మన తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి కూడా ‘గబ్బర్ సింగ్’ చిత్రం టికెట్స్ కోసం క్యూ లైన్ లో నిల్చున్నాడు, అది మా రేంజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 2న గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వబోతున్న ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా, ఒక్క హైదరాబాద్ లోనే కోటి రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 10 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట.