https://oktelugu.com/

RRR Movie: అక్కడి ప్రశ్నలు ఇక్కడ వద్దంటూ మీడియా పై సెటైర్లు వేసిన జక్కన్న…

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 11, 2021 / 11:39 AM IST
    Follow us on

    RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో “ఆర్ఆర్ఆర్ ” టీం దూకుడుగా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది.

    డిసెంబర్ 9న సినిమా ట్రైలర్ తో సందడి స్టార్ట్ కాగా అదే రోజు ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక అదే ఈరోజు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉండగా, ఈ ఈవెంట్ కు జనాలు ఎక్కువగా రావడంతో క్యాన్సిల్ చేశారు. కాగా నిన్న ఒకే రోజు తమిళ్, కన్నడ, మలయాళం మీడియా లతో సమావేశం నిర్వహించి ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. కాగా బెంగుళూరులో “ఆర్ఆర్ఆర్” మీడియా మీట్ సంధర్భంగా పలువురు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలను ‘ఆర్ఆర్ఆర్’ టీం సమాధానాలు ఇచ్చింది. కాగా తాజాగా హైదరాబాద్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు “ఆర్ఆర్ఆర్” చిత్రబృందం.

    ఈ కార్యక్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు అలియా భట్ కూడా పాల్గొంది. ఇక సమావేశంలో భాగంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఇద్దరు హీరోలతో పాటు రాజమౌళి కూడా సమాధానాలు చెప్పారు. అయితే ఓ జర్నలిస్ట్ మాత్రం అలియాను ఉద్దేశిస్తూ “ఆర్” అనే అక్షరానికి మీ జీవితంలో చాలా ప్రాధాన్యత ఉంది. సినిమా టైటిల్ లో కూడా “ఆర్ఆర్ఆర్” ఉంది. మరి సినిమాను, దాని టైటిల్ ను ఎలా ఎంజాయ్ చేశారు? అని అడిగాడు. ఆ ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ వాళ్ళ ప్రశ్నలను మనం కాపీ కొట్టొద్దు అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు జక్కన్న.