Homeఎంటర్టైన్మెంట్Kalki 2 Movie : కల్కి 2' పై ఆశలు వదిలేసుకోవాల్సిందేనా..? మరో క్రేజీ ప్రాజెక్ట్...

Kalki 2 Movie : కల్కి 2′ పై ఆశలు వదిలేసుకోవాల్సిందేనా..? మరో క్రేజీ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయిన డైరెక్టర్ నాగ అశ్విన్..నిరాశలో ఫ్యాన్స్!

Kalki 2 Movie  గత ఏడాది ఇండియన్ మూవీ లవర్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతిని కల్గించిన చిత్రాలలో ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం. మన మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ ని జోడించి, డైరెక్టర్ నాగ అశ్విన్(Naga Ashwin) ఒక అద్భుతాన్ని ఆవిషరించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే #RRR తర్వాత సీక్వెల్ హైప్ లేకుండా, డైరెక్ట్ మూవీ క్యాటగిరీలలో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన సినిమాగా ‘కల్కి'(Kalki 2898 AD) చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. థియేటర్ లో ఈ సినిమాని చూస్తున్నంతసేపు, అసలు మనం తెలుగు సినిమాకి వచ్చామా?, లేదా హాలీవుడ్ సినిమాకి వచ్చామా?, ఇదేమి క్వాలిటీ, ఇదేమి మేకింగ్ బాబోయ్, డైరెక్టర్ ఆలోచనలకూ దండం పెట్టాల్సిందే అంటూ చూసిన ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచెత్తారు. భవిష్యత్తులో ఈ చిత్రం ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ని సైతం సొంతం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. కల్కి భగవంతుడు భూమి మీదకు ఎలా రాబోతున్నాడు అనే అంశం పై అమితాసక్తిని చూపిస్తున్నారు ఆడియన్స్. నిర్మాత అశ్విని దత్ అయితే ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ ని 60 శాతం కి పైగా పూర్తి చేశామని, కేవలం కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ వరుసగా వేరే ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అవ్వడం వల్ల, ఇప్పట్లో ఈ క్రేజీ సీక్వెల్ పూర్తి అయ్యే అవకాశాలు లేనందున, ఆ చిత్ర డైరెక్టర్ నాగ అశ్విన్ వేరే ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆయన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తాడట.

రీసెంట్ గానే ఆయన ముంబై కి వెళ్లి అలియా భట్ కి స్టోరీ వినిపించగా, ఆమె తెగ నచ్చేసింది, షూటింగ్ ని ఎప్పుడెప్పుడు మొదలు పెడదామా అనేంత ఆత్రుతతో ఎదురు చూస్తుందని సమాచారం. ప్రభాస్ నుండి అనుమతి ని తీసుకొని, వెంటనే ఈ సినిమాని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రభాస్(Rebel Star PRabhas) ఈ ఏడాది లోనే కల్కి సీక్వెల్ ని పూర్తి చేస్తాడు అంటూ వచ్చిన వార్తలన్నీ పక్కకి జరిగినట్టే. మరో ఏడాది వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే సూచనలే కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, హనురాఘవపూడి చిత్రాలను సమాంతరంగా చేస్తున్నాడు. ఇవి రెండు పూర్తి అవ్వగానే ఆయన స్పిరిట్ మూవీ షూటింగ్ కి షిఫ్ట్ అవుతాడు. స్పిరిట్ పూర్తి అయ్యాకనే కల్కి సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉంది. అప్పటి వరకు కల్కి మూవీ లవర్స్ ఎదురు చూడాల్సిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version