Director Maruthi : ప్రభాస్(Rebel star Prabhas) హీరోగా నటించిన ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం వచ్చే నెల 9న సంక్రాంతి కానుకగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కల్కి లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నుండి కాస్త గ్యాప్ వచ్చింది. గడిచిన నాలుగేళ్లలో ప్రభాస్ సినిమా లేని ఏడాది లేదు. ప్రతీ ఏడాది ఆయన నుండి ఎదో ఒక సినిమా విడుదల అవుతూనే ఉండేది. కానీ ఈ ఏడాది మాత్రం ఖాళీగా ఉండిపోయింది. అయితే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ‘రాజా సాబ్’ కి ఇప్పుడు భారీ ప్రొమోషన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్, ట్రైలర్, మొదటి లిరికల్ వీడియో సాంగ్ వచ్చాయి. కానీ ఏది కూడా సినిమా పై హైప్ పెంచడం లో ఉపయోగపడలేదు. ఇప్పుడు ఈ చిత్రం నుండి రెండవ పాట ఈ నెల 13న విడుదల అవ్వబోతుంది.
కనీసం ఈ పాట అయినా హిట్ అయితే, సినిమా మీద కాస్త హైప్ పెరుగుతుందని ప్రభాస్ అభిమానులు ఆశపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ చిత్ర డైరెక్టర్ మారుతీ(Director Maruthi) కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. బాలీవుడ్ లో ఒక ఈవెంట్ కి ఆయన హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) తో కలిసి పాల్గొన్నాడు. నిధి అగర్వాల్ ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయం లో వచ్చిన మారుతీ ని చూసి కలిసి ఫోటో దిగడం రమ్మని ఆహ్వానిస్తుంది నిధి అగర్వాల్. అప్పుడు ఆయన ఫోటోలకు ఫోజు ఇస్తూ నిధి అగర్వాల్ నడుముపై చెయ్యి వేసే ప్రయత్నం చేసాడు. అప్పుడు నిధి అగర్వాల్ నవ్వు చెయ్యి ని పక్కన తీస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
స్వయంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియో ని సోషల్ మీడియా లో షేర్ చేసి, ఇలాంటి వాడికి మనోడు అవకాశం ఇచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది నెటిజెన్స్ ఈ వీడియో ని చూసి అనవసరంగా మారుతీ ని నెగిటివ్ చేస్తున్నారు, ఆయన చాలా క్యాజువల్ గా ఫోటోలకు స్టిల్ ఇచ్చాడు, అది చూస్తేనే అర్థం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. మరికొంతమంది అయితే ఇదేమి ప్రవర్తన అంటూ తిడుతున్నారు.
కానీ అది వాస్తవానికి నిజంగానే మారుతీ కి అలాంటి ఉద్దేశ్యం లేదు. ముందుగా నిధి అగర్వాల్ నే డైరెక్టర్ మారుతీ భుజం పై చేతులు వేస్తుంది. మళ్లీ డైరెక్టర్ తో అలా ఉండడం ఎందుకులే అని, చేతులు తీసి మామూలుగానే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ వీడియో పై నిధి అగర్వాల్ ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అనేది. గతం లో ఆచార్య మూవీ ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ పూజ హెగ్డే తో చేసిన ఒక సరదా సన్నివేశాన్ని తప్పుగా చూపిస్తూ సోషల్ మీడియా లో చాలా నెగిటివ్ చెయ్యాలని చూసారు, అప్పుడు పూజా హెగ్డే వెంటనే రియాక్షన్ ఇచ్చి, చిరంజీవి ని ట్రోల్ చేసేవారికి సరైన సమాధానం చెప్పింది. ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా అలా చేస్తుందో లేదో చూడాలి.
Worst behavior ilanti ep gallaki manodu chance lu ivvadam pic.twitter.com/8yx4XKv8nt
— Sunny Kesh (@sunnykeshII) December 10, 2025