Bigg Boss 9 Telugu : : తెలుగు ఆడియన్స్ కి బిగ్ బాస్(Bigg Boss Telugu) రియాలిటీ షో ఒక వ్యసనంగా మారిపోయింది. విదేశాల్లో మొదలైన ఈ రియాలిటీ షో ని ముందుగా బాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం చేయడం, అక్కడ సూపర్ హిట్ అయ్యేలోపు కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో మొదలు పెట్టడం జరిగింది. అన్ని భాషల్లోనూ ఈ రియాలిటీ షో బంపర్ హిట్ అయ్యింది. తెలుగు లో 8 సీజన్స్ ని పూర్తి చేసుకొని, ఇప్పుడు 9 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ కూడా మరో పది రోజుల్లో ముగియబోతుంది. ఈ సీజన్ అయితే బిగ్ బాస్ తెలుగు హిస్టరీ లోనే ఆల్ టైం టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకు పోతుంది. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ఇప్పుడు ఒక వీడియో తెగ వైరల్ గా మారింది. ఆ వీడియో ని చూసి ఆడియన్స్ ఈ ఊహా ఎంత బాగుందో అని అంటున్నారు.
ఈ వీడియోలో రామ్ గోపాల్ వర్మ హోస్ట్ గా, టాలీవుడ్ స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు కంటెస్టెంట్స్ గా ఉండడం మీరు చూడొచ్చు. యంగ్ హీరోయిన్స్ కూడా ఈ వీడియో లో ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ తిక్క తిక్క మాటలతో హోస్టింగ్ చేయడం, చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, ఇలా విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న సూపర్ స్టార్స్ అందరూ ఒకే ఇంట్లో 100 రోజుల పాటు ఉంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇది ఎలాగో జరగదు, అందుకే AI మన కలల్ని నెరవేరుస్తుంది. ఈ AI వీడియో ని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఒక రేంజ్ లో వైరల్ చేశారు. అలా బాగా వైరల్ అయినా ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
ఇక ఈ సీజన్ బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా ఎవరు నిలవబోతున్నారు అనే దానిపై ఇంకా ఆడియన్స్ లో ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి అయితే తనూజ టాప్ 1 స్థానం లో కొనసాగుతుంది. ఆమెకే టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే గత రెండు వారాలుగా పవన్ కళ్యాణ్ కి కంటెంట్ లేదు, అదే విధంగా ఆయన నామినేషన్స్ లోకి కూడా రాలేదు. అందుకే తనూజ ముందంజ లో ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ వారం జరుగుతున్నా ఇమ్మ్యూనిటి టాస్కుల ద్వారా ఎవరు సేవ్ అయ్యి రెండవ ఫైనలిస్ట్ అవుతారు అనే నిపై ఆడియన్స్ లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
Celebrity bigboss with RGV as Host #BiggbossTelugu9 pic.twitter.com/Pwxpw8qh7L
— BigBoss Telugu Views (@BBTeluguViews) December 10, 2025