Director Krish : టాలీవుడ్ లో మంచి కంటెంట్ ఉన్న దర్శకులలో ఒకరు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi). అసలు ఈ డైరెక్టర్ ఇలా మీడియం రేంజ్ క్యాటగిరీలో ఉండాల్సిన వాడు అసలు కాదు. రాజమౌళి, సుకుమార్ లాంటి లెజెండ్స్ తో సమానంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే సత్తా ఉన్న డైరెక్టర్. ఒకప్పుడు ఈయన సినిమాలు చూస్తే మన కళ్ళలో నుండి తెలియకుండానే నీళ్లు వచ్చేవి. ఏ దర్శకుడు కూడా ముట్టుకోలేని కాన్సెప్ట్స్ తో సినిమాలను తెరకెక్కించడమే కాకుండా, హృదయాలకు హత్తుకునే విధంగా సినిమాలను తీయడంలో క్రిష్ సిద్ద హస్తుడు. అయితే క్రిష్ కి సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ఆయన కెరీర్ ఇలా తయారైందని అందరూ అంటుంటారు. ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం తో డైరెక్టర్ క్రిష్ జాతకం మారిపోతుంది, ఇక అగ్ర దర్శకులలో ఒకరిగా చేరిపోతాడని అంతా అనుకున్నారు. కేవలం 9 నెలల్లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేద్దామని అనుకున్నారు.
Also Read : ప్రవస్తి సంచలన ఆరోపణలపై సింగర్ సునీత స్ట్రాంగ్ కౌంటర్..వీడియో వైరల్!
ప్లానింగ్ ప్రకారమే షూటింగ్ వాయు వేగంలో జరిగింది. ఫస్ట్ హాఫ్ ని చాలా తొందరగా పూర్తి చేశారు. కానీ మధ్యలో కరోనా మహమ్మారి విలయతాండవం, లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) రాజకీయాల్లో బిజీ అవ్వడం వంటివి జరగడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎక్కువ కాలం ఆ సినిమాతో ప్రయాణం చేసే ఓపిక లేక, ఆ చిత్రం నుండి తప్పుకున్నాడు డైరెక్టర్ క్రిష్. ఈ చిత్రం నుండి తప్పుకున్న క్రిష్ అనుష్క(Anushka Shetty) తో ‘ఘాటి'(Ghaati Movie) చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని గత ఏడాది విడుదల చేయగా ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుందో మనమంతా చూసాము. సున్నితమైన సినిమాలను తీసే క్రిష్ లో ఇలాంటి యాంగిల్ కూడా దాగుందా అని ఈ టీజర్ ని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు.
ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని గ్రాండ్ గా అధికారిక ప్రకటన కూడా చేసాడు. 18 వ తేదీ దాటి నాలుగు రోజులు అయ్యింది. కానీ ఈ సినిమా ఊసే లేదు. ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా ఇప్పటి వరకు రాలేదు. షూటింగ్ జరుగుతున్నట్టు కూడా ఎక్కడా ఆనవాళ్లు కూడా లేవు. దీంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందా?, లేకపోతే క్రిష్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడా?, సినిమా వాయిదా పడితే, కనీసం వాయిదా వేస్తున్నాము, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము అని చెప్పాలి కదా?, ఎందుకు చెప్పలేదు?, దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్రిష్ సినిమాలకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, కేవలం ఈ రెండు చిత్రాలకు మాత్రమే కాదు, బాలీవుడ్ లో ఆయన ‘మణికర్ణిక’ వంటి చారిత్రాత్మక చిత్రాన్ని మొదలు పెట్టి, మధ్యలోనే వెళ్ళిపోయాడు. మిగిలిన సినిమాని కంగనా రనౌత్ దర్శకత్వం వహించాల్సి వచ్చింది.
Also Read: ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?