Homeఎంటర్టైన్మెంట్Sunitha VS Pravasthi : ప్రవస్తి సంచలన ఆరోపణలపై సింగర్ సునీత స్ట్రాంగ్ కౌంటర్..వీడియో వైరల్!

Sunitha VS Pravasthi : ప్రవస్తి సంచలన ఆరోపణలపై సింగర్ సునీత స్ట్రాంగ్ కౌంటర్..వీడియో వైరల్!

Sunitha VS Pravasthi  : గత కొద్దిరోజులుగా ఈటీవీ లో ప్రసారమయ్యే ‘పాడుతా తియ్యగా'(Padutha Theeyaga) సింగింగ్ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న ప్రవస్తి(Pravasti), ఆ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఏంఏం కీరవాణి(MM Keeravani), చంద్రబోస్(Chandrabose) లపై, అలాగే మరో న్యాయనిర్ణేత సింగర్ సునీత(singer sunitha) పై చేసిన సంచలన ఆరోపణలు ఎలా వైరల్ అయ్యాయో మనమంతా చూస్తూనే. ఈ ముగ్గురు నాపై తీవ్రంగా వివక్ష చూపించారని, సింగింగ్ షో లో చిందులు వేయమని అంటున్నారు, కాస్ట్యూమ్స్ కూడా వాళ్లకు ఇష్టమొచ్చినవి వేయమనేవారని,కుళ్ళు జోకులు వేసేవారని చెప్పుకొచ్చింది. బాలసుబ్రమణ్యం గారు ఉన్నప్పుడు షో చాలా అద్భుతంగా ఉండేదని, ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ ఈ షో ని నిర్వహించడం మొదలు పెట్టిందో, అప్పటి నుండి ఇవన్నీ మొదలయ్యాయి అంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై సింగర్ సునీత రియాక్షన్ ఇస్తూ ఒక వీడియో ని విడుదల చేసింది.

Also Read : స్టేజిపై త్రిష తో కమల్ హాసన్ అసభ్యకరమైన జోక్..ఈ వయస్సులో అవసరమా?

అందులో ఆమె ప్రవస్తి చేసిన కామెంట్స్ పై చాలా విచారం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘ప్రవస్తి మమ్మల్ని ఇలా అర్థం చేసుకున్నందుకు చాలా బాధగా ఉంది. టాలెంట్ షోస్ ఎలా నిర్వహిస్తారో ఆ అమ్మాయికి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం దారుణం. ప్రవస్తి చిన్న అమ్మాయి కాదు. ఆమెని చిన్నపిల్లని ముద్దు చేసినట్టు చేస్తూ మాట్లాడలేము కదా. పాటల విషయంలో చానెల్స్ కి హక్కులు ఉండాలి. ఏ పాట పడితే ఆ పాట ని పాడేందుకు వీలు లేదు. ఆడియన్స్ చెప్తే అన్ని విషయాలు చెప్పాలి. ఇలా సగం సగం చెప్పి, మీకు కావాల్సినవి చెప్పి సానుభూతి పొందాలని అనుకోవడం సబబు కాదు. కీరవాణి గారు ఆస్కార్ అవార్డు గ్రహీత. ఆయనకు ఆ అవార్డు ని చూసి గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వయస్సు ని చూసి అయినా గౌరవం ఇవ్వాలి. నీ తండ్రి తో సమానమైన వ్యక్తి పై కూడా ఆరోపణలు చేసావు, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు’ అంటూ సునీత మాట్లాడింది.

ఇంకా ఆమె పూర్తిగా ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియోలో చూడండి. ఎన్నో ఏళ్ళ నుండి ఈ పాడుతా తియ్యగా షో విజయవంతంగా నడుస్తుంది. ఎప్పుడూ కూడా ఇలాంటి వివాదాలు రాలేదు. ఎంతో మంది అద్భుతమైన గాయకులూ ఈ షో నుండే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి లెజెండ్స్ గా మారారు. ‘పాడుతా తియ్యగా’ అంటే మన అందరికీ ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి లెజెండ్ గుర్తుకొస్తారు. ఆ షో కి ఎంతో గొప్ప వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన. అలాంటి మహోన్నత వ్యక్తి పని చేసిన షో పై ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరమని అంటున్నారు నెటిజెన్స్. ఇరు వైపు ఆరోపణలు విన్న తర్వాత, దయచేసి ఏవైనా గొడవలు ఉంటే మీలో మీరే తేల్చుకోండి, ఇలా బయటకు వచ్చి బ్రాండ్ వేల్యూ ని చెడగొట్టకండి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Sunitha VS Pravasthi | Sunitha Emotional Request To Pravasthi Comments On MM Keeravani | AF

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version