Director James Cameron: #RRR మూవీ కి గ్లోబల్ వైడ్ గా రీచ్ రావడానికి ప్రధాన కారణాలలో ఒకరు జేమ్స్ కెమరూన్(James Cameron). అవతార్, టైటానిక్ లాంటి సంచలనాత్మక చిత్రాల సృష్టికర్త ఈయన. ఆయన #RRR ని చూసి ప్రశంసించిన వీడియో అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా ఈయన దర్శకత్వం వహించిన ‘అవతార్ 3 : ది ఫైర్ & యాష్'(Avatar 3: The Fire And Ash) చిత్రం ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా విడుదలకు ముందే కొంతమంది సినీ ప్రముఖులకు, పాపులర్ మీడియా చానెల్స్ కి స్పెషల్ షో వేసి చూపించాడు డైరెక్టర్ జేమ్స్ కెమరూన్. ఆ ప్రముఖులలో రాజమౌళి(SS Rajamouli) కూడా ఉన్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత జేమ్స్ కెమరూన్ తో వీడియో కాల్ మాట్లాడిన రాజమౌళి, ‘అవతార్ 3’ అనుభవాన్ని పంచుకున్నాడు.
ఆయన మాట్లాడుతూ ‘ప్రేక్షకుల కంటే ముందు ‘అవతార్ 3′ చిత్రాన్ని చూసే అదృష్టం నాకు కలగడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమాలోని విజువల్స్, పాత్రలు, సన్నివేశాలు తీర్చిదిద్దిన విధానానికి డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ కి సెల్యూట్ చేస్తున్నాను. థియేటర్ లో ఈ చిత్రాన్ని చూస్తున్నంతసేపు ఒక సరికొత్త లోకం లోకి అడుగుపెట్టినట్టుగా అనిపించింది. చిన్న పిల్లవాడిలాగా థ్రిల్ కి గురై సినిమాని అలా చూస్తూ ఉండిపోయాను. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ చిత్రం లోని విజువల్స్ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరో జేక్ కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అతను పడే డైలమా సన్నివేశాలు అద్భుతంగా చూపించారు. ఈ చిత్రం గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కథ ని లీక్ చేసినవాడిని అవుతాను. మొదటి రెండు భాగాలను తలదన్నేలా ఈ మూడవ భాగం ఉంది. అవతార్ సిరీస్ వెండితెర కి ఒక సరికొత్త బెంచ్ మార్క్’ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి.
ఈ సందర్భంగా జేమ్స్ కెమరూన్ ‘వారణాసి’ మూవీ విశేషాలను అడిగి తెలుసుకున్నాడు. గత ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నామని, మరో 7 నుండి 8 నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. మీ ‘వారణాసి’ మూవీ సెట్స్ కి నేను రావొచ్చా? అని జేమ్స్ కెమరూన్ అడగ్గా, మీరు మా సెట్స్ లోకి అడుగుపెడితే మాకు మాత్రమే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి కూడా ఎంతో గౌరవంగా ఉంటుందని రాజమౌళి బదులిచ్చాడు. #RRR లో లాగానే ఇందులో కూడా పులి సన్నివేశాలు ఉంటే చెప్పు, వచ్చి చూస్తాను అని జేమ్స్ కెమరూన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Director @JimCameron wants to visit the sets of @VaranasiMovie @ssrajamouli @urstrulyMahesh pic.twitter.com/mJMV00hRKm
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) December 17, 2025