Nagarjuna Donated: మన టాలీవుడ్ లో దాదాపుగా అందరూ హీరోలు డొనేషన్స్ చేయడం చూస్తూ వచ్చాము కానీ, అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) డొనేషన్స్ చేయడం చాలా తక్కువగా చూసాము. ఆయన ఆఫ్ ది రికార్డు డొనేషన్స్ చేసి జనాలకు తెలియనివ్వకుండా ఉంచే ఉద్దేశ్యం ఉండొచ్చు, కానీ నాగార్జున అంత ఆస్తులు పెట్టుకొని డొనేషన్స్ చేయడు అనే ఆరోపణ ఉంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళం అందించి తనని తానూ నిరూపించుకున్నాడు. ఇది ఇలా ఉండగా నిన్నటి నుండి గుడివాడ లో అక్కినేని నాగేశ్వరరావు కళాశాల కి సంబంధించిన వజ్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి నేడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘అక్కినేని నాగేశ్వర రావు కళాశాల వజ్రోత్సవాలు సందర్భంగా, నా తరుపున, నా అక్క సుశీల గారి తరుపున ఈ కాలేజీ స్కాలర్ షిప్ ని అందించాలని నిర్ణయించాము. అందుకోసం తక్షణమే రెండు కోట్ల రూపాయిలు విరాళం అందిస్తున్నాను. కాలేజీ యాజమాన్యం తో మాట్లాడి వెంటనే ఈ ప్రక్రియ మొదలు పెడుతాము. అప్పుడెప్పుడో మా నాన్న గారు ఈ కాలేజీ కి లక్ష రూపాయిల విరాళం అందించాడు. నేను కనీసం ఈమాత్రం కూడా చేయకపోతే బాగుండదు’ అని చెప్పుకొచ్చాడు నాగార్జున. నాగార్జున చేసిన ఈ పనికి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. పిల్లల చదువు కోసం అలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందనీయం అంటూ ఆయన్ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి.
ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆయన నుండి కుబేర, కూలీ చిత్రాలు విడుదలయ్యాయి. రెండు చిత్రాలు మన తెలుగు సూపర్ హిట్స్ గా నిలిచాయి. కూలీ లో నాగార్జున పోషించిన విలన్ రోల్ అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసింది. అయితే ప్రస్తుతం ఆయన 100 వ సినిమా పై పూర్తిగా ఫోకస్ పెట్టాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన హీరో గా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాని ఎక్కడా తక్కకుండా చాలా గ్రాండ్ గా తీస్తున్నారట. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన తోటి సీనియర్ హీరోలందరూ ఇప్పటికీ హీరోలుగా కొనసాగుతూ భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటున్నారు. కానీ నాగార్జున మాత్రం సోలో హీరో గా హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. చూడాలి మరి వందవ చిత్రం ఆయనకు ఎలాంటి జ్ఞాపకం ఇస్తుందో అనేది.
“మా అక్కినేని కుటుంబం తరుపున గుడివాడ ANR కాలేజీకి 2 కోట్లు విరాళం ఇస్తున్నాం.
మా నాన్న గారు ఎప్పుడో లక్ష రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు మేము ఇది కూడా ఇవ్వకపోతే బాగోదు.”
– #Nagarjuna pic.twitter.com/cZKguTwmqi
— Gulte (@GulteOfficial) December 17, 2025