Director Harish Shankar- Anasuya: యాంకర్ అనసూయకు ఇచ్చి పడేసిన డైరెక్టర్ హరీష్ శంకర్… ఇది మామూలు ర్యాంగింగ్ కాదు!

అప్పట్లో నటుడు బ్రహ్మాజీ అనసూయను ఈ వివాదంలో టార్గెట్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా అనసూయపై సెటైర్స్ వేశాడు. తాజాగా విజయ్ దేవరకొండ పేరు ముందు 'The' అని పెట్టడాన్ని అనసూయ తప్పుబట్టింది.

Written By: Shiva, Updated On : May 10, 2023 1:07 pm

Director Harish Shankar- Anasuya

Follow us on

Director Harish Shankar- Anasuya: విజయ్ దేవరకొండ వర్సెస్ అనసూయ వివాదం కొనసాగుతోంది. ఈ లొల్లిలో చాలా మంది అనసూయనే తప్పుబడుతున్నారు. అటెన్షన్ కోసమో, పర్సనల్ అజెండాతోనో అనసూయ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తున్నారు. అనసూయ ఆరోపణల మీద విజయ్ దేవరకొండ బహిర్గతంగా ఏనాడూ స్పందించలేదు. బహుశా ఆమెది తన స్థాయి కాదు, మనం స్పందించాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తూ ఉండవచ్చు. ఒక వేళ తెర వెనుక ఇవ్వాల్సిన కౌంటర్లు ఇచ్చేస్తున్నాడేమో తెలియదు. అనసూయకు మాత్రం విజయ్ దేవరకొండ అంటే పడదు. ఇది క్లియర్.

నెలల వ్యవధిలో రెండుసార్లు విజయ్ దేవరకొండను ఆమె గెలికారు. నిజానికి అనసూయకు సంబంధం లేని మేటర్స్ లో తల దూర్చుతున్నారు. లైగర్ ప్లాప్ పై బహిరంగంగా స్పందించాల్సిన అవసరం లేదు. ఆ హీరో నీకు నచ్చకపోతే నీలో నువ్వు ఎంజాయ్ చేస్తే సరి. అందరూ అదే చేస్తారు. అంతే కానీ నా ప్రత్యర్థి సినిమా ప్లాప్ అయ్యిందని సంబరాలు చేసుకోరు. అనసూయ అదే చేసింది. అప్పుడో రచ్చ జరిగింది. అనసూయ శైలిపై మండిపడ్డ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేశారు.

అప్పట్లో నటుడు బ్రహ్మాజీ అనసూయను ఈ వివాదంలో టార్గెట్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా అనసూయపై సెటైర్స్ వేశాడు. తాజాగా విజయ్ దేవరకొండ పేరు ముందు ‘The’ అని పెట్టడాన్ని అనసూయ తప్పుబట్టింది. ఆయన పేరు ఎత్తకుండా పిచ్చి పీక్స్ అంటూ ఎద్దేవా చేసింది. దీంతో మళ్ళీ లొల్లి షురూ అయ్యింది. గత నాలుగు రోజులుగా అనసూయను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

ఈ వివాదంలో విజయ్ దేవరకొండకు మద్దతుగా హరీష్ శంకర్ నిలిచారు. విజయ్ దేవరకొండ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ అనసూయకు సెటైర్ వేశాడు. తన బర్త్ సందేశంలో హరీష్ శంకర్ పలుమార్లు ‘The’ అనే పదాన్ని హైలెట్ చేశాడు. పేరుకు ముందు ది పెట్టుకోవడాన్ని తప్పుబట్టిన అనసూయకు హరీష్ శంకర్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చాడు. ఈ వివాదంలో తప్పు నీదే అని హరీష్ అనసూయకు చెప్పినట్లు అయ్యింది. ఇకపై ఇలాంటి వివాదాలు రాజేయకు అని చెప్పకనే చెప్పారు ఆయన.

https://twitter.com/harish2you/status/1655569405353381890