TS SSC Results : తెలంగాణ పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 86.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను రాష్ట్ర విద్యా పరిశోధన మండలి (ఎన్.సీఈఆర్టీ) ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 4,86,194 మంది దరఖాస్తు చేసుకోగా 4,84,384 మంది హాజరయ్యారు. వీరంతా రిజల్ట్స్ కోసం దురు చూస్తున్నారు. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్షలు ముగియగా 14వ తేదీన వాల్యుయేషన్ ప్రక్రియ ను ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 18 కేంద్రాల్లో వాల్యుయేషన్ నిర్వహించారు. ఏప్రిల్ 21వ తేదీ వరకు పూర్తిచేశారు.
తుది ఫలితాల్లో తప్పులు దొర్లకుండా అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ చేస్తున్నారు. టెక్నికల్ ట్రయల్స్‌ను పలుమార్లు నిర్వహించారు. అంతా సవ్యంగా జరుగడంతో బుధవారం ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించారు.
ఫలితాల్లో బాలికలు 88.53 శాతం… బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ వ్యాప్తంగా 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 స్కూళ్లలో సున్నా శాతం ఫలితాలు వచ్చాయి. 25 పాఠశాల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని మంత్రి సబిత తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణతలో 99 శాతంతో ప్రథమ స్థానంలో నిర్మల్ జిల్లా నిలిచింది. 59.46 శాతంతో చివరి స్థానంలో వికారాబాద్ సరిపెట్టుకుంది.
జూన్ 14 నుంచి 22 వరకూ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. ఈనెల 26 లోపు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు.
