https://oktelugu.com/

Harish Shankar: నీలాంటోళ్లను ఎంతోమందిని చూసేసా..అసలు పట్టించుకోను అంటూ హీరో రానా దగ్గుబాటి కి డైరెక్టర్ హరీష్ శంకర్ కౌంటర్!

పూర్తి వివరాల్లోకి వెళ్తే రానా తేజ సజ్జతో మాట్లాడుతూ 'ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ ఇటీవల కాలం ఎప్పుడూ చూడని హై చూసారు..అదే విధంగా లౌ కూడా చూసారు' అని అంటాడు. దానికి తేజ సజ్జ మాట్లాడుతూ 'హై అంటే కల్కి, మరి లౌ ఏంటి?' అని అడుగుతాడు. '

Written By:
  • Vicky
  • , Updated On : November 6, 2024 / 06:07 PM IST

    Harish Shankar(1)

    Follow us on

    Harish Shankar: ఇటీవల అబుదాబి లో IIFA అవార్డ్స్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఈవెంట్ ని రీసెంట్ గానే జెమినీ టీవీ లో టెలికాస్ట్ చేసారు. అదే విధంగా యూట్యూబ్ లో కూడా ఈ ఈవెంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఈవెంట్ కి అన్ని ఇండస్ట్రీస్ నుండి సూపర్ స్టార్స్, లెజెండ్స్ విచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేశారు. అయితే ఈ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించిన దగ్గుబాటి రానా, తేజ సజ్జ చేసిన కామెడీ ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద వివాదాలకు దారి తీసింది. మహేష్ బాబు , అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలపై వీళ్లిద్దరు వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఫన్ చేయొచ్చు కానీ, మరీ ఈ స్థాయికి దిగజారకూడదు అని నెటిజెన్స్ వీళ్లిద్దరి పై మండిపడుతున్నారు. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదల బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం పై వీళ్లిద్దరు పేల్చిన జోక్ డైరెక్టర్ హరీష్ శంకర్ వరకు వెళ్ళింది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే రానా తేజ సజ్జతో మాట్లాడుతూ ‘ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ ఇటీవల కాలం ఎప్పుడూ చూడని హై చూసారు..అదే విధంగా లౌ కూడా చూసారు’ అని అంటాడు. దానికి తేజ సజ్జ మాట్లాడుతూ ‘హై అంటే కల్కి, మరి లౌ ఏంటి?’ అని అడుగుతాడు. ‘అదే మొన్ననే విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది కదా..మిస్టర్ బచ్చన్’ అని అంటాడు రానా. దీనికి రవితేజ ఫ్యాన్స్ కోపగించుకొని హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ ఈ వీడియో ని పోస్ట్ చేసాడు. దానికి హరీష్ శంకర్ కౌంటర్ ఇస్తూ ‘నా కెరీర్ లో ఇలాంటివి ఎన్నో విన్నాను, ఎన్నో చూసాను తమ్ముడు..అందులో ఇదొక్కటి. అన్ని రోజులు ఒకేలా ఉండవు, అది నాకైనా ఎవరికైనా..కాబట్టి ఇలాంటివి నేను పట్టించుకోను’ అంటూ చెప్పుకొచ్చాడు. నిజంగా హరీష్ శంకర్ పట్టించుకోని టైపు అయితే ఈ విషయం పై ఇంతలా స్పందించేవాడు కాదు. ఆయన కచ్చితంగా ఈ మాటలకు బాధపడ్డాడు అనేది ఆ కౌంటర్ ని చూస్తేనే అర్థం అవుతుంది.

    కేవలం హరీష్ శంకర్ ని, రవితేజ ని అభిమానించే వాళ్ళు మాత్రమే కాదు, మహేష్ బాబు అభిమానులు కూడా తేజ సజ్జ, రానా దగ్గుబాటి పై విరుచుకుపడుతున్నారు. మరి ఇంత వివాదాస్పదంగా మారిన వీళ్లిద్దరి హోస్టింగ్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి స్పందిస్తారా లేదా అనేది చూడాలి. నిజంగా స్పందించి, క్షమాపణలు చెప్పే ఉద్దేశ్యమే ఉండుంటే, ఈ పాటకి ఎవరో ఒకరు ట్విట్టర్ ద్వారా క్షమాపణలు తెలియచేసి ఉంటారు. కానీ అటు తేజ సజ్జ, ఇటు రానా దగ్గుబాటి మౌనం వహించడం పై అభిమానులు ఇంకా కోపం పెంచేసుకున్నారు. మరి ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.