https://oktelugu.com/

AP Cabinet Meeting: 40 వేల మందికి సత్వర ఉపాధి.. ఉద్యోగ విరమణ వయస్సు పెంపు.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు*

వైసీపీ హయాంలో జరిగిన భూఆక్రమణల విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ యాక్ట్ ను సైతం సరికొత్తగా రూపొందించనుంది. ఇకనుంచి ఎవరైనా భూవాక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలకు దిగేలా చట్టాలను రూపొందించనుంది ఏపీ సర్కార్.

Written By:
  • Dharma
  • , Updated On : November 6, 2024 / 06:10 PM IST

    AP Cabinet Meeting

    Follow us on

    AP Cabinet Meeting: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు మంత్రివర్గం భేటీ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులకు వీలుగా కొత్త పాలసీలకు ఆమోదముద్ర వేసింది క్యాబినెట్. ఏపీలో డ్రోన్ పాలసీని ఆమోదించింది. కుప్పం తో పాటుగా పిఠాపురంలోనూ ఏరియా డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రోహిబిషన్ 2024 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజకీయ అంశాల పైన చర్చ జరిగింది. ప్రధానంగా వైసిపి హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై క్యాబినెట్ చర్చించింది. ఇకపై ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే కఠినంగా శిక్షించేలా చట్ట సవరణ చేయడానికి నిర్ణయించింది. ఎందుకోసం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్ 2024 కు ఆమోదం తెలిపింది. 2014- 2018 మధ్య నీరు చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులు, పనుల ప్రారంభానికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జిఎస్టి 2024 చట్ట సవరణను మంత్రిమండలి ఆమోదించింది. రాష్ట్రంలో కొత్త డ్రోన్ పాలసీని క్యాబినెట్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. డ్రోన్ రంగంలో 40 వేల మందికి ఉపాధి లక్ష్యంగా పాలసీని రూపొందించింది. ప్రపంచంలో బెస్ట్ డ్రోన్ సెంటర్ గా ఏపీలోని ఓర్వకల్లును అభివృద్ధి చేయడానికి నిర్ణయించింది. అక్కడ 50 డ్రోన్ నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు సమ్మతించింది క్యాబినెట్.

    * ఆ రెండు నియోజకవర్గాలకు ప్రాధాన్యం
    సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, పిఠాపురం నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకొని ఏరియా డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుకు సైతం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి 11 మండలాల్లో 154 గ్రామాలను తిరిగి సి ఆర్ డి ఏ పరిధిలోకి తెస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మరోవైపు జ్యుడీషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయస్సును 61 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్.

    * రాజకీయాలపై చర్చ
    అయితే ప్రధానంగా రాజకీయంగా కూడా కీలక చర్చలు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని మంత్రిత్వ శాఖల పనితీరు విషయంలో సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పనితీరు మెరుగుపరుచుకోవాలని క్యాబినెట్ సహచరులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పాలనతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరినట్లు సమాచారం. మొత్తానికైతే క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం విశేషం.