Unstoppable Show: ఫీల్డ్ ఏదైనా నేను దిగనంత వరకే… వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీన్ రిపీట్ అని మళ్ళీ నిరూపించారు నందమూరి బాలకృష్ణ. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్‌స్టాపబుల్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో ఒకటిగా ‘అన్‌స్టాపబుల్’ నిలిచింది. తనదైన శైలిలో హోస్ట్ గా బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఈ షో కు ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, అఖండ టీమ్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇక రాజమౌళి, కీరవాణి కూడా పాల్గొన్న ఎపిసోడ్ ను త్వరలోనే ప్రసారం చేయనున్నారు. “అన్‌స్టాపబుల్” షో ఆశ్చర్యకరంగా రాజమౌళి, రవితేజ, అల్లు అర్జున్ వంటి ఊహించని అతిథులను తెరపైకి తీసుకు వస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది ఆహా టీమ్.

కాగా అన్ స్టాపబుల్ మొదటి సీజన్ చివరి దశకు చేరినట్లు ఆహా యజమాన్యం తెలియజేసింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో చివరి ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా రానున్నారు. ఇప్పటికే మహేష్ బాలయ్య షోలో పాల్గొన్నట్లు సమాచారం ఉంది. అయితే ఇది ఫైనల్ ఎపిసోడ్ గా ప్రసారం కానుందని స్పష్టత వచ్చింది. మరి ఈ షోలో మహేష్, బాలయ్య మధ్య ఎలాంటి ఆసక్తికర విషయాలు చర్చకు వస్తాయనే ఆసక్తి నెలకొని ఉంది. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కి వస్తుందా అని అటు ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A BLOCKBUSTER Episode Coming Soon🔥#UnstoppableWithNBK Season Finale with Superstar @urstrulyMahesh🤩
Raasi pettukondi…watching #NandamuriBalakrishna Garu and #MaheshBabu together will be a feast. pic.twitter.com/9HmnQ4M0gD
— ahavideoin (@ahavideoIN) December 22, 2021