Pragathi Remunaration: అమ్మగా.. అత్తగా.. అక్కగా.. వదినగా.. రకరకాల పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పిస్తోంది నటి ప్రగతి. సినిమాల్లో మిగతా నటులతో సమానంగా ఆమె క్యారెక్టరిజం పండిస్తుంది. పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోయి నటించే ఆమె సినిమాల్లో చాలా కాలం నుంచే కొనసాగుతోంది. వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై పలు సీరియళ్లలో నటిస్తూ ఆకట్టుకుంటోంది. సినిమాల్లో చాలా సింపుల్ గా కనిపించే ప్రగతి రియల్ లైఫ్లో మాత్రం భిన్నంగా ఉంటుంది. మోడ్రన్ ఆంటీలా కనిపిస్తూ అలరిస్తుంటుంది. జిమ్ చేస్తూ.. డ్యాన్స్ తో ఊర్రూతలూగిస్తుంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తానే షేర్ చేస్తుంది. దీంతో ప్రగతి సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ నటిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ప్రగతి ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుంది..? ఆమె సంపాదన ఎంత..? అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.
సినిమాల్లో సాంప్రదాయ మహిళలా కనిపించే ప్రగతి రియల్ లైఫ్లో మోడ్రన్ లైఫ్ ను మెయింటేన్ చేస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్ లో కసరత్తు చేస్తుంటుంది. కుర్ర యువతిలా డ్యాన్స్ చేస్తూ యూత్లో జోష్ పెంచుతుంది. అంతే కాకుండా యంగ్ గర్ల్స్ వేసుకునే డ్రెస్సులు వేసుకుంటుంది. దీంతో ఆమె తీరుపై కొందరు విమర్శలు చేశారు. అయినా ప్రగతి అవేమీ పట్టించుకోదు. తన లైఫ్ తన ఇష్టం అన్నట్లు ఎంజాయ్ చేస్తుంటుంది. సినిమాలకు రియల్ లైఫ్ కు చాలా తేడా ఉంటుందని ప్రగతి కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి కూడా..
Also Read: Dipti Dhyani: నిజమైన త్యాగం… భర్త కోసం గుండు చేయించుకున్న ఈ నటి ఎవరో గుర్తుపట్టారా?
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు రోజూవారీ రెమ్యూనరేషన్ ఉంటుంది. ప్రతీ రోజు నటించిన వారికి అదే రోజూ పేమెంట్ చేస్తారు. కొందరు సీనియర్లకు మాత్రం ప్యాకేజీ లెక్కన ఇస్తారు. వీరిలాగే ప్రగతి కూడా రోజూవారీ పేమెంట్ తీసుకుంటుందట. ఈ లెక్కన ప్రగతి ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 50 వేల నుంచి రూ.70 వేల వరకు తీసుకుంటుందట. సినిమాను బట్టి ప్రగతికి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తారట. ఇప్పడున్న మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ప్రగతికి బోలెడు అవకాశాలు వస్తున్నాయి.
రీసెంట్ గా రిలీజైన ‘ఎఫ్3’లో ప్రగతి నటన హైలెట్ గా నిలిచింది. ఇన్నిరోజులు నటించిన సినిమాల్లో కంటే ‘ఎఫ్3’లో పాత్ర బాగా నచ్చిందని ప్రగతి చెప్పారు. ఈ సినిమాలోని పాత్ర తనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించే ‘భోళా శంకర్’ సినిమాలోనూ ప్రగతి నటిస్తోంది. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ ప్రగతిని ఆఫర్స్ వచ్చాయి.
తాజాగా ప్రగతి బర్త్ డే సందర్భంగా స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని ఫొటోలు దిగింది. ఈ ఫొటోల్లో ప్రగతి అమ్మాయిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్ల వైరల్ గా మారాయి. కానీ కొందరు ఆమె డ్రెస్సింగ్ పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కానీ ప్రగతి వాటిని పట్టించుకోవడం లేదు. తనకు విషెష్ చెప్పిన వారికి మాత్రం థ్యాంక్స్ చెబుతోంది.
Also Read:Vikram Movie Collections: విక్రమ్ మొదటి రోజు వసూళ్లు.. కమల్ హాసన్ విశ్వరూపం చూపించాడు