https://oktelugu.com/

Ram Charan- Shankar Movie: చరణ్ సినిమా పై దిల్ రాజు సంచలన నిర్ణయం.. తిరిగి చెన్నై వెళ్లిపోయిన శంకర్

Ram Charan- Shankar Movie: విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. అయితే, ఒకపక్క టాలివుడ్ లో సినిమా షూటింగ్ లు ఆగిపోయినా.. ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతూనే వచ్చింది. దాంతో, ఈ సినిమా నిర్మాత దిల్ రాజు పై చాలా విమర్శలు వినిపించాయి. ‘అన్నీ సినిమాల షూటింగ్ లు ఆపేసి.. నీ సినిమా షూటింగ్ ను ఎలా చేసుకుంటావు ?’ అంటూ […]

Written By:
  • Shiva
  • , Updated On : August 7, 2022 / 11:04 AM IST
    Follow us on

    Ram Charan- Shankar Movie: విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. అయితే, ఒకపక్క టాలివుడ్ లో సినిమా షూటింగ్ లు ఆగిపోయినా.. ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతూనే వచ్చింది. దాంతో, ఈ సినిమా నిర్మాత దిల్ రాజు పై చాలా విమర్శలు వినిపించాయి. ‘అన్నీ సినిమాల షూటింగ్ లు ఆపేసి.. నీ సినిమా షూటింగ్ ను ఎలా చేసుకుంటావు ?’ అంటూ దిల్ రాజు పై ఓ వర్గం బాగా సీరియస్ అయ్యింది. దాంతో దిల్ రాజు కూడా చరణ్ – శంకర్ సినిమా విషయంలో సడెన్ గా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

    Ram Charan-, Shankar Dil Raju

    ఈ సినిమా షూటింగ్ ను నేటి నుంచి ఆపేసే విధంగా దిల్ రాజు నిర్ణయం తీసుకున్నాడు. షూట్ ఆగిపోవడంతో దర్శకుడు శంకర్ చెన్నైకు తిరిగి వెళ్లిపోయారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ‍రీసెంట్ గానే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్ షూట్ అయిపోతే.. ఇక ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి అయినట్టే. అందుకే, చెన్నైకు వెళ్లిన దర్శకుడు శంకర్ ఇండియన్ 2 చిత్రం పనిలో పడ్డారని తెలుస్తోంది.

    Also Read: Sita Ramam Collections: ‘సీతా రామం’ 3rd డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయి ? ఇంకెంత రావాలి ?

    అతి త్వరలోనే ఇండియన్ 2 చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హీరోయిన్ కాజల్ కూడా ఈ సినిమా కోసం సిద్దంగా ఉందట. మొత్తానికి శంకర్ ఒకేసారి రెండు పెద్ద సినిమాలను డీల్ చేస్తున్నాడు. మరి ఈ బిజీ షెడ్యూల్ కారణంగా సినిమాల అవుట్ ఫుట్ పై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.

    Ram Charan- Shankar

    అయితే, శంక‌ర్ అంటేనే గ్రాండియ‌ర్‌. అందుకే.. చరణ్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. అన్నిటికి మించి ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌ పని చేస్తున్నారు. లార్డ్ ఆఫ్ రింగ్స్‌, ది విచ్చేర్‌, ది హాబిట్ సినిమాల‌కు వ‌ర్క్ చేసిన మేక‌ప్ టీమ్ వేటా వ‌ర్క్ షాప్ ఈ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నారు.

    చరణ్ ను చాలా కొత్తగా చూపించడానికి వీళ్లు లేటెస్ట్ పరికరాలను కూడా ఉపయోగించారు. రామ్‌ చరణ్‌ రాజకీయ నేతగా కనిపించనున్నాడు. పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు శంకర్. అయితే, ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని శంకర్ ఆశ పడుతున్నాడు. ఎలాగూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో శంకర్ సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తాడు. కాబట్టి.. ఈ సినిమాతో తన ఆశను తీర్చుకుంటాడేమో చూడాలి.

    Also Read:Bimbisara Collections: ‘బింబిసార’ 3rd డే కలెక్షన్స్.. మోత మోగిస్తున్న కళ్యాణ్ రామ్

    Tags