https://oktelugu.com/

Sita Ramam- Pooja Hegde: ‘సీతారామం’ సినిమాలో హీరోయిన్ పాత్రని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Sita Ramam- Pooja Hegde: వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మళ్ళీ వైభవం తీసుకొచిన్న సినిమాలలో ఒకటి సీతారామం..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరో గా మృణాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో స్టార్ హీరోయిన్ రష్మిక మండన ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది..హను రాఘవపూడి ఈ చిత్రాన్ని ఎంతో పొయిటిక్ గా కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీ గా తీర్చిదిద్దిన తీరు ప్రతిఒక్కరిని మంత్రముగ్దులను చేసింది..మొదటి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 7, 2022 / 11:15 AM IST
    Follow us on

    Sita Ramam- Pooja Hegde: వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మళ్ళీ వైభవం తీసుకొచిన్న సినిమాలలో ఒకటి సీతారామం..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరో గా మృణాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో స్టార్ హీరోయిన్ రష్మిక మండన ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది..హను రాఘవపూడి ఈ చిత్రాన్ని ఎంతో పొయిటిక్ గా కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీ గా తీర్చిదిద్దిన తీరు ప్రతిఒక్కరిని మంత్రముగ్దులను చేసింది..మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..చాలా ప్రాంతాలలో మొదటిరోజు వచ్చిన వసూళ్లకంటే రెండవ రోజు వచ్చిన వసూళ్లు ఎక్కువ ఉండడం విశేషం..ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది అనే చెప్పాలి..ఇవన్నీ పక్కన పెడితే ఇందులో లీడ్ పెయిర్ గా నటించిన దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ కి అద్భుతమైన పేరు వచ్చింది..హీరోయిన్ గా మృణాల్ కూడా అత్యద్భుతంగా నటించింది..ఈ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని ట్రేడ్ పండితులు చెప్తున్నా మాట.

    Sita Ramam- Pooja Hegde

    అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం తొలుత చాలా మంది హీరోయిన్స్ ని అనుకున్నారట..వారిలో ఒకరు పూజ హెగ్డే..ఈమె సౌత్ లోనే టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న క్రేజీ హీరోయిన్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఈ పాత్ర ఆమెకి సరిగ్గా ఉంటుందని ముందుగా ఆమె వద్దకే వెళ్లారట మేకర్స్..కానీ అప్పటికే ఆమె వరుసగా నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది..అందువల్ల ఈ సినిమాకి డేట్స్ సర్దుబాటు చెయ్యలేకపోయింది అట.

    Also Read: Ram Charan- Shankar Movie: చరణ్ సినిమా పై దిల్ రాజు సంచలన నిర్ణయం.. తిరిగి చెన్నై వెళ్లిపోయిన శంకర్

    Sita Ramam- Pooja Hegde

    ఒకవేళ పూజ హెగ్డే ఈ పాత్ర ని చేసి ఉంటె ఆమె కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ లో ఒకటిగా నిలిచేది అని చెప్పొచ్చు..ఎందుకంటే పూజ హెగ్డే ఇప్పటి వరుకు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యింది..నటన కి ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇప్పటి వరుకు చెయ్యలేదు..అంతే కాకుండా ఈమధ్య కాలం లో ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి..వాటి బదులు ఇలాంటి సినిమాలు చేసి ఉంటె నటిగా కూడా తనని తానూ ప్రూవ్ చేసుకునేది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..కానీ పూజ హెగ్డే ఆ పాత్ర వదులుకోవడం వల్ల ఇండీస్ట్రీ లో మృణాల్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులను ఆడియన్స్ చూడగలిగారు..ఆమెని క్రేజీ హీరోయిన్ గా మలచడం లో పూజ హెగ్డే సహాయం ఎంతైనా ఉందనే చెప్పాలి.

    Also Read:Sita Ramam Collections: ‘సీతా రామం’ 3rd డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయి ? ఇంకెంత రావాలి ?

    Tags