https://oktelugu.com/

Dil Raju: మళ్ళీ తండ్రి కాబోతున్న దిల్ రాజు

Dil Raju: ఒక సామాన్య డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు, ఇప్పుడు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ నిర్మాతగా మారి, థియేటర్లను కంట్రోల్ లో పెట్టుకోవడంతో పాటు.. తనకు భవిష్యత్తులో పోటీ రావొచ్చు అనే అనుమానం ఉన్న యువి, గీతా లాంటి సంస్థలను కూడా తనతోనే కలుపుకుని, మొత్తానికి ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. అయితే, దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత. కొన్నాళ్ల క్రితం అనిత హఠాత్తుగా మరణించారు. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 22, 2022 / 11:22 AM IST
    Follow us on

    Dil Raju: ఒక సామాన్య డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు, ఇప్పుడు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ నిర్మాతగా మారి, థియేటర్లను కంట్రోల్ లో పెట్టుకోవడంతో పాటు.. తనకు భవిష్యత్తులో పోటీ రావొచ్చు అనే అనుమానం ఉన్న యువి, గీతా లాంటి సంస్థలను కూడా తనతోనే కలుపుకుని, మొత్తానికి ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. అయితే, దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత.

    కొన్నాళ్ల క్రితం అనిత హఠాత్తుగా మరణించారు. దాంతో, దిల్ రాజు.. లాక్ డౌన్ సమయంలో రెండో పెళ్ళి చేసుకున్నారు. కూతురు, పెద్దల సలహాతో తమ కుటుంబానికి ముందు నుంచీ పరిచయమున్న వైఘా రెడ్డి (తేజస్విని)ని పెళ్ళి చేసుకున్నారు. అయితే, దంపతులు త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తోంది.

    Also Read:  ‘విజయ్ దేవరకొండ’తో సోషల్ మీడియా బ్యూటీ రొమాన్స్

    ప్రస్తుతం ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది. అన్నట్టు ఇన్నాళ్లు దిల్ రాజు కి వారసుడు ఎవరూ లేరని ఆ ఇంట ఎంతో లోటుగా ఉండేది. మరి, ఈ సారి వారసుడు జన్మిస్తే ఇక ఆ ఇంట సంబరాలు అంబరాన్నంటుతాయి. ఇక దిల్ రాజు ఓ చిన్న సైజ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే కంటెంట్ ఏజెన్సీ కూడా పెట్టబోతున్నాడు.

    అంటే ఎవరైనా అవుట్ ఫుట్ తో వస్తే.. దాన్ని మార్కెట్ చేసే సంస్థ అన్నమాట. ఓటిటికి కంటెంట్ విక్రయించే పనితో పాటు కంటెంట్ ను తయారు చేసే విధంగా తన సంస్థను మార్చబోతున్నాడు. ఇప్పటికే దిల్ రాజుకు శాటిలైట్ హక్కుల కొనుగోలు, అమ్మకాల బిజినెస్ కూడా వుంది. ఇప్పుడు అలాగే ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

    Dil Raju

    ఏమైనా దిల్ రాజు మాత్రం ఇండస్ట్రీలో తనకున్న ఇమేజ్ ను నిలబెట్టుకోవడానికి బాగానే ప్రయత్నం చేస్తోన్నాడు. ఆ మధ్య యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్ట్ అనే ఒక కొత్త ఆలోచన చేసి, మెయిన్ నిర్మాతలందర్నీ ఒకచోటుకు చేర్చి.. దానికి హెడ్ గా ఉంటూ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ వ్యవహారాలను కూడా తన అదుపులోకి తెచ్చుకున్న టాలెంట్ దిల్ రాజుది. మరి ఇప్పుడు కూడా అలాంటి టాలెంట్ నే ఓటిటి రంగంలో కూడా చూపించబోతున్నాడు.

    అన్నట్టు దిల్ రాజుకి మరో ఆలోచన కూడా ఉందట. ఫుల్ అండ్ గుడ్ స్క్రిప్ట్ తో వస్తే.. దానికి ఫండింగ్ చేయడనికి కూడా దిల్ రాజు తన సంస్థ డిజైన్ చేస్తున్నాడట. మరి కొత్త డైరెక్టర్స్ కి ఇదే మంచి టైం అనుకోవాలి. ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ లు ఉంటే, వెంటనే దిల్ రాజులో సంస్థ వాలిపోండి. అదృష్టం కలిసొస్తే డైరెక్టర్ అయిపోవచ్చు.

    Also Read:  పూనమ్‌ బూతు పై బూతుల హీరోయిన్ ఘాటు ప్రశంసలు !

    Recommended Video:

    Tags