https://oktelugu.com/

Kotha Bangaru Lokam: ‘కొత్త బంగారు లోకం’ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో కుమారుడు

Kotha Bangaru Lokam: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అగ్రనిర్మాతగా ఎదగడంలో ఆయన కెరీర్ మొదట్లో చేసిన చిత్రాలు ఎంతో ఉపయోగపడ్డాయి. దిల్ మూవీ నుంచి ఆయన కొత్త హీరోలు, దర్శకులతో చేసిన ప్రయోగాలు సక్సెస్ ను ఇచ్చాయి. ఈ క్రమంలోనే కొత్త దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ‘కొత్త బంగారులోకం’. శ్వేత బసు ప్రసాద్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.   సున్నితమైన కథ, భావోద్వేగాలు, మధురమైన […]

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2022 5:51 pm
    Follow us on

    Kotha Bangaru Lokam: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అగ్రనిర్మాతగా ఎదగడంలో ఆయన కెరీర్ మొదట్లో చేసిన చిత్రాలు ఎంతో ఉపయోగపడ్డాయి. దిల్ మూవీ నుంచి ఆయన కొత్త హీరోలు, దర్శకులతో చేసిన ప్రయోగాలు సక్సెస్ ను ఇచ్చాయి. ఈ క్రమంలోనే కొత్త దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ‘కొత్త బంగారులోకం’. శ్వేత బసు ప్రసాద్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.

     

    సున్నితమైన కథ, భావోద్వేగాలు, మధురమైన ప్రేమ, కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఈ సినిమాను యూత్ విపరీతంగా ఆదరించారు. ఇది దిల్ రాజ్ కు నాడు 7వ సినిమాగా విడుదలై కాసులు కురిపించింది.

    అయితే ఈ సినిమాతో అక్కినేని నాగచైతన్యను హీరోగా లాంచ్ చేస్తానని ఈ ప్రపోజల్ ను నాగార్జున ముందు పెట్టాడట దిల్ రాజు. సాఫ్ట్ మూవీ కావడం.. యాక్షన్ ఎపిసోడ్స్ కు పెద్దగా అవకాశం లేకపోవడంతో చైతన్యను ఈ మూవీతో లాంచ్ చేయడం కరెక్ట్ కాదని నాగార్జున రిజెక్ట్ చేశాడట.. ఈ విషయాన్ని దిల్ రాజ్ ఇటీవల ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

    నాగచైతన్య హీరోగా లాంచ్ అవ్వాల్సిన ఈ మూవీలో అతడి ప్లేసులో వరుణ్ సందేశ్ ను తీసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో నాగార్జునకు దిల్ రాజుపై నమ్మకం కలిగింది. ఆ తర్వాత జోష్ కథతో నాగార్జునను దిల్ రాజ్ సంప్రదించారు. అది కూడా కాలేజ్ బ్యాక్ డ్రాప్ కావడం.. శివ లాంటి సినిమా టచింగ్ పాయింట్ ఉండడంతో నాగచైతన్యను హీరోగా లాంచ్ చేయడానికి నాగార్జున ఒప్పుకున్నారు. దిల్ రాజుకు అప్పగించారు. అయితే జోష్ సినిమా అంతగా ఆడకపోవడంతో ఫ్లాప్ అయ్యింది. నాగార్జున నిరాశ మిగిల్చింది.

    ఇక ఇదే కథను ముందుగా రాంచరణ్ తో చేయాలని భావించాడట దిల్ రాజు. చిరంజీవి రిజెక్ట్ చేయడంతో కథ నాగార్జున దగ్గరికి వెళ్లిందట.. అలా రిజెక్ట్ చేసిన మూవీ హిట్ కావడం.. ఎంపిక చేసుకున్న మూవీ ప్లాప్ కావడంతో నాగార్జున నిరాశ చెందారని సమాచారం.

    Also Read: 10 నిమిషాల్లో ఫుడ్ డెలవరీకి ఎదురుదెబ్బ.. క్లారిటీ ఇచ్చిన జొమాటో సీఈవో