Dil Raju : తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ సినిమాలను తీయాలంటే అది కొంతమంది ప్రొడ్యూసర్స్ కి మాత్రమే సాధ్యమవుతుంది. అందులో దిల్ రాజు మొదటి స్థానంలో ఉంటాడు. ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. నిజానికి ఆయన నుంచి వచ్చే సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నిర్మాత దిల్ రాజు…ఆయన తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ప్రస్తుతం ఆయన స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించి భారీ విజయాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రీసెంట్ గా సినిమా పెద్దలంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ అరేంజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మీటింగ్ లో బెనిఫిట్ షోస్ కి అవకాశం లేదని కరకండిగా చెప్పడంతో దిల్ రాజు కూడా గేమ్ చేంజర్ సినిమాకి బెనిఫిట్ షోస్ ఆశించడం లేనట్టుగా తెలుస్తోంది. కానీ టికెట్ల మీద రేట్ మాత్రం పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి దిల్ రాజు మాత్రం గేమ్ చేంజర్ సినిమా మీద దాదాపు 500 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయించారు. కాబట్టి ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే తప్ప దిల్ రాజు మరోసారి భారీ లాభాలను ఆర్జించే అవకాశమైతే లేదు. ఒకవేళ ఈ సినిమా తేడా కొడితే మాత్రం ఆయన భారీగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మరి కొంతమంది సినిమా ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా సినిమాకి భారీ ఇబ్బంది వచ్చి పడిందనే చెప్పాలి. ఇక దిల్ రాజు అనుకుంటున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ గా మరొక మెట్టు పైకి ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
సీఎం తో మీటింగ్ ముగిసిన తర్వాత గేమ్ చేంజర్ సినిమాకి బెన్ ఫిట్ షోస్ అవసరం లేదని సీఎం గారు చెప్పిన మాట మీదనే మేము కట్టుబడి ఉంటామని చెప్పడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా సినిమా టికెట్ల రేట్ల పెంపు ఉంటుంది కాబట్టి ఎలాగైనా సినిమాని సూపర్ సక్సెస్ చేయాల్సింది మెగా అభిమానులే అంటూ అభిమానుల మీద భారాన్నైతే పెట్టాడు. మరి మెగా ఫ్యామిలీ అభిమానులు మొత్తం ఎలాగైనా సరే ఈ సినిమాను సూపర్ సక్సెస్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడితే తప్ప ఈ సినిమా మంచి విజయాన్ని అయితే సాధించలేదు. కాబట్టి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇతరుల నుంచి ఎదురు అయ్యే పోటీని తట్టుకొని నిలబడాలంటే మాత్రం రామ్ చరణ్ కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాల్సిన అవసరమైతే ఉంది…