Jabalpur: మద్యం కిక్కు మామూలుగా ఉండదు. మత్తు తలెకెక్కిందటే.. తనకు తానే కింగ్ అనుకుంటారు మందుబాబులు. అందుకే చాలా మంది లిమిట్‌గా మద్యం తాగుతారు. కానీ కొందరు ఒళ్లు తెలియనంతగా తాగి వాహనాలు నడుపుతూ న్యూసెన్స్ చేస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఎదుటివారిని ఇబ్బంది పెడుతున్నారు. ఈ కాలంలో యువత ఎక్కువగా మద్యం తాగి వామనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలబారిన పడుతున్నారు. హిట్ అండ్ రన్ చేస్తున్నారు. అయినా తాగి వాహనాలు నడపడం మానడం లేదు. ఇక్కడ ఓ మందుబాబు మద్యం మత్తులో రైలు చక్రాల పక్కన పడుకున్నాడు. ఒళ్లు తెలియని మైకంలో చక్రాల పక్కనే ఉండి 250 కిలోమీటర్లు ప్రయాణించాడు.
ఒళ్లు గగ్గుర్లు పొడిచే ఘటన..
ఇది నమ్మసక్యం కాని, ఒళ్లు గగ్గుర్లు పొడిచే ఘటన. మద్యం మత్తులో రైలు చక్రాల మధ్య వేలాడుతో అతను చేసిన ప్రయాణం.. కాదు కాదు సాహసం మామూలుగా లేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ కింద దాక్కున్న ఓ వ్యక్తి.. ఇటాఈ‍్స నుంచి జబల్‌పూర్ వరక దాదాపు 250 కిలోమీటర్లు రైలు బోగీ చక్రాల మధ్య వేలాడుతూ ప్రయాణం సాగించాడు. ఇది అందరినీ షాక్‌కు గుచిచేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. జబల్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్‌మెంట్ ఉదో‍్యగులు రోలింగ్ పరీక్ష చేస్తుండగా ఎస్-4 కోచ్ కింద వ్యక్తిని గుర్తించారు.
ఉదో‍్యగులు షాక్..
రైలు బోగీ కింద ఉన్న వ్యక్తి పరిస్థితి చూసి ఉద్యోగులు కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు. వారు బలవంతంగా అతడిని బోగీ కింద చక్రాల మధ్య నుంచి బయటకు తీశారు. అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉండి ఇలా రైలు కింద వేలాడుతూ ప్రయాణించినట్లు గుర్తించారు.
డబ్బులు లేకనే..
ఇక అతడిని అదికారులు విచారణ చేశారు. ఇందులో అతనివద‍్ద టికెట్‌కు డబ్బులు లేవని గుర్తించారు. అందుకే ప్రయాణం కోసం ఇలా రిస్‌్క చేసినట్లు తెలిపాడు. ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం తెలియలేదు. రైలుకింద ఎలా దాక్కున్నాడు అనేది కూడా ఆస్పష్టంగా, ఆశ్చర్యకరంగా ఉంది. ప్రస్తుతం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#BreakingNews *”यह खबर हैरान कर देगी”*
*टिकट के लिए पैसा नही था, तो ट्रेन के बोगी के नीचे पहिये के पास बैठ कर एक शख्स ने किया 250 किलोमीटर का सफर!!*
मध्य प्रदेश में इटारसी से जबलपुर आने वाली दानापुर एक्सप्रेस ट्रेन के S-4 बोगी के नीचे पहिये के पास बने ट्राली में एक व्यक्ति ने… pic.twitter.com/41ZUpDOBxY
— THIS IS WRONG NUMBER (@Thiswrongnumber) December 27, 2024
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: A jabalpur man traveled 250 kilometers sitting by the wheel under a train bogie without money for a ticket
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com