Dil Raju Comments On Manchu Vishnu: సినిమాని ఒక రివ్యూ చంపేస్తుందా..?, రివ్యూయర్స్ నెగటివ్ రివ్యూస్ ఇవ్వడం వల్లనే 10 రోజులు ఆడాల్సిన సినిమా కేవలం మొదటి రోజే పడిపోతుందా? అంటే అవుననే చెప్పాలి. ఎన్నో నెలలు కష్టపడి సినిమా తీసి, కోట్ల రూపాయిల ఖర్చు చేస్తే రివ్యూయర్స్ తమ సొంత అభిప్రాయం క్రింద చెప్పే రివ్యూలు సినిమాల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందుకే మేకర్స్ ఇక నుండి విడుదలయ్యే సినిమాలకు కనీసం వీకెండ్ వరకు అయినా రివ్యూస్ ఇవ్వకూడదు అని బలమైన చర్యలు తీసుకునేలా ప్రణాళికలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మంచు విష్ణు(Manchu Vishnu) అయితే ఇప్పటికే ఆ విధంగా చర్యలు తీసుకున్నాడు. రీసెంట్ గా విడుదలైన తన ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రం పై ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కావాలని నెగెటివ్ రివ్యూస్ ఇస్తే వాళ్లపై కచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఒక హెచ్చరికను జారీ చేసాడు.
Also Read: మరోసారి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి దిల్ రాజు సోదరుడు క్షమాపణలు..సంచలనం రేపుతున్న వీడియో!
కేవలం వార్నింగ్ ఇవ్వడమే కాదు, చేసి చూపించాడు కూడా. తెలుగు రాష్ట్రాల్లో షోస్ కూడా ప్రారంభం కాకముందే రివ్యూస్ ఇచ్చే రివ్యూయర్స్ నోర్లను మూయించాడు. మూడు రోజుల వరకు వాళ్ళ నుండి నెగటివ్ రివ్యూస్ రాకుండా చేసాడు. దాని ఫలితం కనిపించింది. వీకెండ్ వరకు ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఒకవేళ రివ్యూయర్స్ ఎప్పటి లాగానే రివ్యూస్ ఇచ్చి ఉండుంటే ఈ సినిమా మొదటి రోజే సర్దేసేది. అయితే మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) స్వాగతించాడు. ఆయన మాట్లాడుతూ ‘మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం నిజంగా స్వాగతించదగినదే. ఇలా చేస్తే ఇండస్ట్రీ బాగు పడుతుంది. రివ్యూస్ ఇచ్చే వాళ్ళ నోర్లను మూయించడం మా ఉద్దేశ్యం కాదు. కానీ కొంతమంది బాగున్న సినిమాకు కూడా ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఆ కారణంగా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఒక సినిమాకు ఎక్కువ నష్టపోయేది నిర్మాత మాత్రమే. హీరోకి నటీనటులకు కావాల్సిన పారితోషికం వచ్చేస్తుంది. కానీ నిర్మాతకు మాత్రమే ఫ్లాప్ అయితే నష్టం మిగిలేది. సినిమా బాగుంటే ఆడియన్స్ ఆదరిస్తారు, లేకపోతే లేదు, మీరెందుకు విడుదలైన తెల్లవారిజామునే రివ్యూస్ అంటూ మీకు ఇష్టమొచ్చింది రాసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మా సినిమా మీద కూడా అలా ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ రివ్యూస్ రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాము’ అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఆయన నిర్మాత గా వ్యవహరించిన ‘తమ్ముడు’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దిల్ రాజు ఈ సినిమా కోసం స్పెషల్ గా కేర్ తీసుకొని బలంగా ప్రమోట్ చేస్తున్నాడు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు దిల్ రాజు నే కనిపిస్తున్నాడు. సినిమాకు సెన్సార్ బోర్డు నుండి మంచి రిపోర్ట్ ఉన్నది. మరి ఆడియన్స్ నుండి ఎలాంటి రిపోర్ట్ వస్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.